తమిళ (Kollywood) స్టార్ హీరో విజయ్ (Vijay) తెలుగు డైరెక్టర్ వంశీపైడిపల్లి (Vamshi Paidipally)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చెన్నైలో గ్రాండ్‌గా విజయ్ (Vijay 66th) 66వ సినిమా లాంఛ్ యింది. ఈ ప్రాజెక్టులో కన్నడ సోయగం రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయ్ నేరుగా చేస్తున్న తొలి తెలుగు సినిమా అని ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చాడు దళపతి. బీస్ట్ ప్రమోషన్స్ లో దిల్ రాజుతో చేస్తున్న తన నెక్ట్స్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు.
ఇది తెలుగు సినిమా కాదు. కేవలం తమిళ సినిమా మాత్రమే. ఆ తర్వాత ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతోపాటు ఇతర భాషల్లో భారీ ఎత్తున డబ్బింగ్ చేసి విడుదల చేస్తారు. ఫైనల్ కాపీ బయటకు వచ్చే సరికి ఇది ఒక ఇండియన్ సినిమా అని చెప్పుకొచ్చాడు. అంటే వంశీపైడిపల్లితో చేయబోతున్న సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండదని ఇన్‌డైరెక్టుగా చెప్పేశాడు విజయ్. ఈ అప్ డేట్‌తో ఫ్యాన్స్ లో ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఈ మూవీకి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సోలోమన్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌కు తండ్రిగా కోలీవుడ్ నటుడు శరత్‌కుమార్ కనిపించబోతున్నట్టు వార్తలు వస్తుండగా…దీనిపై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది.