జీవితం, బంధాలు.. స్నేహం వెరసి 3 రోజెస్
ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్'. ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సిరీస్ తొలి సీజన్ మంచి విజయాన్ని సాధించిందని మేకర్స్ చెబుతున్నారు.
ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’. ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సిరీస్ తొలి సీజన్ మంచి విజయాన్ని సాధించిందని మేకర్స్ చెబుతున్నారు. ఈ నెల 12 నుంచి ‘త్రీ రోజెస్’ సీజన్ 2 ఆహాలో స్ట్రీమింగ్ కానున్నది. డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరించిన ఈ సిరీస్‌కు కిరణ్ కె.కరవల్ల దర్శకుడు.
ఈ సీజన్ 2 హైలైట్స్‌ను కథానాయిక ఈషా రెబ్బా, నటుడు హర్ష చెముడు మంగళవారం మీడియాతో పంచుకున్నారు. ఈషా మాట్లాడుతూ ‘తొలి సీజన్‌ను మించి ఈ మలి సీజన్ ఉంటుంది. ఇందులో గ్లామర్ డోసేం ఎక్కువగా ఉండదు. కుటుంబంతో కలిసి ఈ సిరీస్ చూడొచ్చు. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి.
ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాల నిడివి ఉంటుంది. సీజన్ 3కి లీడ్ ఇస్తూ ఈ సీజన్ ముగుస్తుంది. నేను, హర్ష సీజన్ 1లో చేసిన సీన్స్ అంత వైరల్ అవుతాయని అనుకోలేదు. ఆ రెస్పాన్స్ ఈ సీజన్ 2కు బాగా హెల్ప్ అయింది. ఈ సిరీస్ నా కెరీర్‌కే స్పెషల్.’ అని తెలిపారు. ‘తొలి సీజన్‌తో పోల్చుకుంటే ఈ సీజన్ 2కు బడ్జెట్ ఎక్కువ. సీజన్ 1లో రివేంజ్‌ను ఈ సీజన్ 2లో తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటా.
ఈషా, నా క్యారెక్టర్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తాయి. తెలుగు వెబ్ సిరీస్‌లతో చూసుకుంటే ఇది పక్కా సీక్వెల్. షూటింగ్ అంతా సరదాగా సాగిపోయింది. ఇందులో జీవితం, బంధాలు, స్నేహం గురించి చర్చించాం. మారుతి ఈ సిరీస్‌ను బాగా గైడ్ చేశారు. ఈ సిరీస్ ఇంత గ్రాండ్ కాన్వాస్‌లో రావడానికి కారణం ఆయనే’ అని పేర్కొన్నారు హర్ష చెముడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
France Protests | ఫ్రాన్స్‌లో నిరసనలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

