Bimbisara Movie | ఓటీటీలో ‘బింబిసార’ సరికొత్త రికార్డు?
Bimbisara Movie | ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాలలో ‘బింబిసార’ ఒకటి. కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి మల్లడి వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాల్లేకుండా ఆగస్టు 5న విడులైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.
Bimbisara Movie | ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాలలో ‘బింబిసార’ ఒకటి. కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి మల్లాడి వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాల్లేకుండా ఆగస్టు 5న విడులైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. రిలీజైన ఫస్ట్ వీక్‌లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన చిత్రంగా ‘బింబిసార’ నిలిచింది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. డ్యూయల్ రోల్లో కళ్యాణ్‌రామ్ అద్భుతంగా నటించాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓటీటీలోనూ ఈ చిత్రం దూసుకుపోతుంది.
అక్టోబర్ 21నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం డిజిటల్‌లోనూ ఘన విజయం సాధిస్తుంది. ఈ చిత్రం తాజాగా 200మిలియన్(20 కోట్ల) స్ట్రీమింగ్ మినట్స్‌ను సొంతం చేసుకుంది. ఇంత వేగంగా ఈ ఘనతను అందుకున్న సినిమాగా బింబిసార జీ-5లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో కళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథరీన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్స్ట్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రూ.15 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం ఫైనల్‌గా రూ.36 కోట్ల వరకు షేర్ సాధించి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. ప్రస్తుతం ‘బింబిసార-2’ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అన్ని కుదిరితే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

