సృజనాత్మక దర్శకుడు సుకుమార్ అందించిన కథతో రూపొందుతున్న వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ‘18 పేజేస్’. ఇటీవల ‘కార్తికేయ 2’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న జంట నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా చివరి షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. కాగా ఈ చిత్రాన్ని డిసెంబరు 23న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రానికి కథ: సుకుమార్, సంగీతం:గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ: వసంత్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శరణ్ రాపర్తి, అశోక్ బండ్రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: బాబు.