వకీల్ సాబ్ ఫైనల్ కలెక్షన్స్ ఎంతంటే..
వకీల్ సాబ్ క్లోజింగ్ కలెక్షన్స్ | ఏప్రిల్ 9న భారీ అంచనాలతో విడుదలైన వకీల్ సాబ్.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వసూళ్ల వేటలో వెనకబడిపోయింది. అయినా కూడా పోటీ పడి మరీ మంచి కలెక్షన్స్ సాధించింది.

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా వకీల్ సాబ్ డిజిటల్ ప్రింట్ వచ్చేసింది. వచ్చీ రాగానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంచి వ్యూస్ సాధిస్తుంది. చాలా రోజుల నుంచి థియేటర్లలో సినిమా చూడలేకపోయిన అభిమానులు పవన్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే సినిమా విడుదలై మూడు వారాలు అయిపోయింది. ఏప్రిల్ 9న భారీ అంచనాలతో విడుదలైన వకీల్ సాబ్.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వసూళ్ల వేటలో వెనకబడిపోయింది. అయినా కూడా పోటీ పడి మరీ మంచి కలెక్షన్స్ సాధించింది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. శృతిహాసన్ చిన్న పాత్రలో మెరిసింది. పింక్ సినిమా కథను పవన్ ఇమేజ్‌కు తగ్గట్లు మార్చి చాలా బాగా తీర్చిదిద్దాడు శ్రీరామ్ వేణు. పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు బయటి ఆడియన్స్ కూడా వకీల్ సాబ్ సినిమాను మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ బయటికి వచ్చాయి.

వకీల్ సాబ్ క్లోజింగ్ కలెక్షన్స్
నైజాం- 25.02 కోట్లు
సీడెడ్- 12.95 కోట్లు
ఉత్తరాంధ్ర- 11.79 కోట్లు
ఈస్ట్- 6.27 కోట్లు
వెస్ట్- 7.25 కోట్లు
గుంటూరు- 7.12 కోట్లు
కృష్ణా- 4.91 కోట్లు
నెల్లూరు- 3.34 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 78.02 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 3.59 కోట్లు
ఓవర్సీస్- 3.85 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 85.67 కోట్లు షేర్
వకీల్ సాబ్ సినిమా రూ.89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఫైనల్ గా 85 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. పవన్ కెరీర్ లో ఇవే అత్యధిక వసూళ్లు. అత్తారింటికి దారేది రూ.81 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వకీల్ సాబ్ ఆ సినిమాను దాటేసింది. కానీ టికెట్ రేట్స్ తక్కువగా ఉండటంతో వసూళ్లు కూడా తక్కువగానే వచ్చాయి. పైగా కరోనా కూడా ఉండటంతో లక్ష్యానికి 5 కోట్ల దూరంలోనే ఆగిపోయాడు పవర్ స్టార్. చివరికి అబౌ యావరేజ్ గా నిలిచింది వకీల్ సాబ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రానా మరో పాన్ ఇండియా ప్రాజెక్టు..అఫీషియల్!
జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న యంగ్ హీరో..!
తమిళ ఇండస్ట్రీకి కలిసి రాని 2021.. వరుస మరణాలతో షాక్‌లో ఫ్యాన్స్!
నిధి అగర్వాల్ సోయగం చూడతరమా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

