‘ఈగల్’లో వినోదానికి లోటుండదు
‘ఈగల్' వాణిజ్య అంశాలతో కూడిన విభిన్నమైన సినిమా. వినోదం కావాల్సినంత ఉంటుంది. అందరికీ నచ్చే సినిమా ఇది’ అని అగ్రహీరో రవితేజ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. జనవరి 13న సినిమా విడుదల కానుంది.
‘ఈగల్’ వాణిజ్య అంశాలతో కూడిన విభిన్నమైన సినిమా. వినోదం కావాల్సినంత ఉంటుంది. అందరికీ నచ్చే సినిమా ఇది’ అని అగ్రహీరో రవితేజ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. జనవరి 13న సినిమా విడుదల కానుంది. దావ్జాంద్ స్వరాలందించిన సినిమాలోని ‘గల్లంతే..’ అని సాగే రెండో పాటను ఈ రోజు చిత్రబృందం విడుదల చేసిన సందర్భంగా రవితేజ మాట్లాడారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను కపిల్ కపిలన్, లిన్ కలిసి ఆలపించారు. ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, చదువుకునే రోజుల్లో రవితేజ అభిమానినైన తాను ఆయన సినిమాకు మ్యూజిక్ అందించడం ఆనందంగా ఉందని దావ్జాంద్ అన్నారు. రవితేజతో కలిసి నటించడం పట్ల కథానాయిక కావ్యా ధాపర్ ఆనందం వెలిబుచ్చింది. ఇంకా ఈ వేడుకలో చిత్రబృందం అంతా పాల్గొన్నారు.
అంజనాద్రి ప్రపంచంలోకి మాస్‌మహారాజ్
హనుమంతుని నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్‌వర్మ తెరకెక్కించిన ఫాంటసీ థ్రిల్లర్ ‘హను-మాన్’ చిత్రంలో ఓ వానరం పాత్ర ఉంది. సినిమాలో దానిపేరు కోటి. సినిమా ఆద్యంతం ఉండే ఈ వానరం పాత్ర ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని అగ్రహీరో రవితేజతో ఆ వానరానికి డబ్బింగ్ చెప్పించారు దర్శకుడు ప్రశాంత్‌వర్మ. వానరాలంటే చంచలమైన స్వభావానికీ, చమత్కారాలకూ ప్రసిద్ధి. అలాంటి వానరానికి రవితేజ మార్క్ హ్యూమర్, ఎనర్జీ, వాయిస్ తోడవ్వడం ఈ సినిమాకు హైలైట్ కానుందని దర్శకుడు చెబుతున్నారు. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

