YouTube | ట్రెండింగ్ పేజీని మూసివేయనున్న యూట్యూబ్..!
YouTube | ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ట్రెండింగ్ పేజీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ట్రెండింగ్ పేజీని 2015లో ప్రారంభించగా.. వైరల్ వీడియోలు, బ్రేకింగ్ న్యూస్, టాప్ మ్యూజిక్ రిలీజ్‌లను హైలైట్ చేసేందుకు అవకాశం ఉండేది.
YouTube | ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ట్రెండింగ్ పేజీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ట్రెండింగ్ పేజీని 2015లో ప్రారంభించగా.. వైరల్ వీడియోలు, బ్రేకింగ్ న్యూస్, టాప్ మ్యూజిక్ రిలీజ్‌లను హైలైట్ చేసేందుకు అవకాశం ఉండేది. దాదాపు దశాబ్దకాలం పాటు యూజర్లకు ట్రెండింగ్ కంటెంట్‌ను అందించిన ఈ ఫీచర్‌ను ఈ ఏడాది జులై 21 నుంచి వీడ్కోలు పలుకనున్నది. వినియోగదారుల వ్యూయింగ్ హ్యాబిట్స్‌లో వచ్చిన మార్పులతో పాటు ప్లాట్‌ఫామ్ అభివృద్ధికి అనుగుణంగా మూసివేయాలని నిర్ణయించినట్లు యూట్యూబ్ పేర్కొంది. యూట్యూబ్ ట్రెండింగ్ పేజీ గతంలో యూజర్లకు ప్లాట్ఫామ్లో పాపులర్ కంటెంట్‌ను తెలుసుకునేందుకు ఓ మెయిన్ డెస్టినేషన్‌గా ఉన్నది. ఈ పేజీలో వీడియోలు అన్ని వర్గాల నుంచి, ముఖ్యంగా హై క్లిక్ రేట్‌తో ఉన్నవి కనిపించేవి. గత కొంతకాలంగా యూజర్ల అలవాట్లు మారుతూ వస్తున్నాయి.
యూట్యూబ్ అధునాతన రికమెండేషన్ అల్గారిథమ్‌లు హోమ్పేజీల ద్వారా ట్రెండింగ్ కంటెంట్‌ను నేరుగా అందిస్తుండడంతో ట్రెండింగ్ పేజీకి ఆదరణ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం యూజర్లు షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్‌లు, సెర్చ్ సజెషన్స్ ద్వారా ట్రెండ్స్‌ను ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రెండింగ్ పేజీ స్థానంలో, యూట్యూబ్ చార్ట్స్, కస్టమైజ్ చేసిన రికమెండేషన్లపై యూట్యూబ దృష్టి పెట్టనున్నది. ఈ చార్ట్స్ విభాగాల వారీగా ట్రెండింగ్ కంటెంట్‌ను అందించనుండగా.. యూజర్లకు మరింత నిర్దిష్టమైన కంటెంట్ డిస్కవరీ అనుభవాన్ని అందించనున్నది. అదనంగా, క్రియేటర్లకు సహాయం చేసేందుకు యూట్యూబ్ స్టూడియోలోని ఇన్స్పిరేషన్ ట్యాబ్ తదితర ఫీచర్స్‌ను కొనసాగించనున్నది. ఇవి కొత్త ట్రెండ్లను గుర్తించడంలో సహాయపడనున్నాయి. కొత్త కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించేందుకు ‘హైప్’ ఫీచర్ తదితర కొత్త టూల్స్‌ను యూట్యూబ్ పరిచయం చేయనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

