YouTube | గూగుల్ అనుబంధ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ యూ-ట్యూబ్‌లో సాంకేతిక లోపంతో మంగళవారం కంటెంట్ క్రియేటర్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కంటెంట్ క్రియేటర్లు తమ సమస్యపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వివిధ వెబ్ సైట్లు, సర్వీస్ స్టేటస్ విషయమై యూజర్లకు రియల్ టైం సమాచారమిచ్చే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ డౌన్ డిటెక్టర్ కూడా ఇదే సంగతి తెలిపింది. సుమారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ సమస్య తలెత్తిందని వేలాది మంది కంటెంట్ క్రియేటర్లు తెలిపారు. తమ వీడియోలు అప్ లోడ్ చేసినా, రియల్ టైంలో యూజర్లకు కనిపించట్లేదంటూ ఫిర్యాదు చేశారు.
మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి యూ-ట్యూబ్‌లో వీడియోలను అప్ లోడ్ చేయడంలో 80 శాతం మంది కంటెంట్ క్రియేటర్లకు సమస్యలు మొదలయ్యాయని డౌన్ డిటెక్టర్ తెలిపింది. అయితే ఈ సమస్య భారత్‌కు మాత్రమే పరిమితమా..? ప్రపంచవ్యాప్తంగా జరిగిందా.. అన్న సంగతి వెల్లడి కాలేదు.న్యూస్ చానళ్ల నుంచి ఫీడ్, వీడియోలు, లైవ్ ప్రసారాలు రాక యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలుస్తున్నది. ఎప్పటికప్పుడు కంటెంట్ అందించే క్రియేటర్లు కూడా యూ-ట్యూబ్‌కు సర్వీస్ రిక్వెస్టులు పంపడం ఆసక్తికర పరిణామం.