Postal Savings | బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే వాటిపైనే బెస్ట్ రిటర్న్స్
Postal Savings | వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే పోస్టాఫీసులోని ఐదు పొదుపు పథకాలపైనే ఎక్కువ వడ్డీ లభిస్తున్నది.
Postal Savings | యాక్సిస్ బ్యాంక్‌తోపాటు ఇటీవలే ఐసీఐసీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్ తదితర కేంద్ర ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచేశాయి. ఆయా బ్యాంకులు ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల (ఎఫ్డీ) కంటే పలు పోస్టాఫీసు పొదుపు పథకాలకు ఆదాయం పన్ను మినహాయింపు బెనిఫిట్ పొందొచ్చు. పోస్టాఫీసు పథకాల కింద గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పన్ను ఆదాయం చేయొచ్చు. పోస్టాఫీసు పొదుపు పథకాల్లో ఐదు స్కీమ్‌ల్లో బెనిఫిట్లు ఇలా ఉన్నాయి.
సుకన్య సమృద్ధి యోజనతో ఇలా బెనిఫిట్
బాలికల అభ్యున్నతికి ఉపయోగించే స్కీం సుకన్య సమృద్ధి యోజన పథకం. బాలికా శిశువు జన్మించిన తర్వాత 10 ఏండ్ల లోపు సుకన్య సమృద్ధి యోజన కింద ఖాతా తెరవొచ్చు. కనీసం రూ.250తో ఖాతా ప్రారంభించొచ్చు. ఈ పథకానికి ఏడాదికి 7.6 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నారు. బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల కంటే ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్న స్కీమ్ ఇది. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఈ పథకం అమలవుతున్నది. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు గరిష్ఠంగా డిపాజిట్ చేయొచ్చు. పోస్టాఫీసు బ్రాంచ్లోగానీ, ఆథరైజ్డ్ బ్యాంక్ శాఖలో గానీ ఈ పథకం ప్రారంభించొచ్చు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇలా
60 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో చేరొచ్చు. ఈ పథకం కింద పెట్టుబడులపై ఏటా 7.4 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నారు. 55 ఏండ్లు దాటిన తర్వాత వీఆర్ఎస్ కింద రిటైర్మెంట్ అయిన వారు చేరొచ్చు. అంటే 60 ఏండ్లలోపు వయస్కులు కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఐదేండ్ల వరకు ఈ పథకం కింద పెట్టుబడి పెట్టాలి. మెచ్యూరిటీ దాటిన తర్వాత మూడేండ్ల వరకు పొడిగించే స్కీం ఇది. గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు.
ఇలా పోస్టాఫీసు పీపీఎఫ్
పోస్టాఫీసు అందిస్తున్న మరో సేవింగ్స్ స్కీమ్.. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్). దీనిపై ఏటా 7.1 శాతం వడ్డీ పొందొచ్చు. అసలుపై ఏడాదికోసారి వడ్డీ గణిస్తారు. దాన్ని తదుపరి సంవత్సరం అసలు కింద పరిగణిస్తారు. ఈ పథకం కింద రిటర్న్స్, వచ్చే మెచ్యూరిటీ మొత్తం, వడ్డీ ఆదాయం పైనా ఆదాయం పన్ను రాయితీ లభిస్తుంది. 15 ఏండ్ల గడువుతో ఈ పథకం ప్రారంభించొచ్చు. అటుపై మరో ఐదేండ్లు పొడిగించొచ్చు. కనీసం రూ.500 నుంచి పెట్టుబడి ప్రారంభించొచ్చు. ఏటా గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పొదుపు చేసే వీలు గల స్కీం ఇది.
నేషనల్ సేవింగ్స్ సర్టిపికెట్ (ఎన్ఎస్సీ)లో ఇలా
అత్యంత పాపులర్ పోస్టాఫీసు సేవింగ్స్ స్కీం.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్. ఈ పథకం కింద ఏటా 6.8 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నారు. ఏడాదికోసారి ఆదాయంపై వడ్డీ లెక్క గట్టి ఇన్వెస్ట్మెంట్ టైం పూర్తయిన తర్వాత వడ్డీ చెల్లిస్తారు. ఎన్ఎస్సీ ఖాతా కింద కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి. గరిష్ట పరిమితి లేదు.
పోస్టాఫీసు టైం డిపాజిట్ పథకం
బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ పథకం వంటిదే ఈ పోస్టాఫీసు టైం డిపాజిట్ పథకం. నిర్ధిష్ట పీరియడ్ పరిధిలో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టొచ్చు. దీనిపై ఫిక్స్డ్ రిటర్న్స్, వడ్డీ పేమెంట్స్ పొందొచ్చు. ఈ పథకం కింద ఏటా 5.5 నుంచి 6.7 శాతం మధ్య వడ్డీ చెల్లిస్తారు. ఏడాది నుంచి ఐదేండ్ల గడువు వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు ఉంది. కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు.
బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా
వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై ఐదేండ్ల వరకు ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. ఐదేండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలే పన్ను ఆదా పొదుపు పథకాలు.
వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు ఇలా
బ్యాంక్ —————- వడ్డీరేటు
యాక్సిస్ ————– 6.50శాతం
ఎస్బీఐ —————– 5.65 శాతం
ఐసీఐసీఐ బ్యాంక్ —- 6.10 శాతం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ — 6.10 శాతం
కెనరా బ్యాంక్ ———- 5.75 శాతం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

