Janet Yellen on SVB | సిలీకాన్వ్యాలీ బ్యాంకుకు బెయిల్ఔట్ ప్రసక్తే లేదు.. తేల్చేసిన అమెరికా ఆర్థిక మంత్రి!
Janet Yellen on SVB | దివాళా తీసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank- SVB)కు బెయిల్ ఔట్ ఇచ్చే ప్రసక్తే లేదని అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎల్లెన్ కుండబద్ధలు కొట్టారు.
Janet Yellen on SVB | దివాళా తీసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank)కు బెయిల్ ఔట్ ఇచ్చే విషయమై అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎల్లెన్ (US Treasury Secretary Janet Yellen) కుండబద్దలు కొట్టారు. ఎస్వీబీ (SVB) ఇన్వెస్టర్లు, యజమానులకు బెయిల్ ఔట్ ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. ఎస్వీబీ (SVB) పరిస్థితి.. 2008 ఆర్థిక సంక్షోభానికి భిన్నం అని ఆదివారం `ఫేస్ ది నేషన్` ప్రోగ్రామ్‌లో ప్రకటించారు. 2008 సంక్షోభం వేళ దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఇన్వెస్టర్లు, యజమానులకు బెయిల్ ఔట్ ఇవ్వడం జరిగిందని జానెట్ ఎల్లెన్ చెప్పారు. కానీ, మళ్లీ తాము ఆ పని చేయబోమని తేల్చి చెప్పారు. డిపాజిటర్లు జమ చేసిన మొత్తంపై వారికి భరోసా కల్పించడంపైనే తమ ప్రభుత్వం ఆందోళన చెందుతున్నదన్నారు.
ఎస్వీబీలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సరైన విధానాన్ని రూపొందించడానికి తమ బ్యాంకింగ్ రెగ్యులేటర్లతో కలిసి పని చేస్తున్నామని జానెట్ ఎల్లెన్ (US Treasury Secretary Janet Yellen) తెలిపారు. పూర్తి వివరాలను వెల్లడించలేదు. సిలికాన్ వ్యాలీ బ్యాంకును సొంతంగా టేకోవర్ చేయడం ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ -FDIC) ముందు ఉన్న ఒక ఆప్షన్ అని ఆమె తెలిపారు. అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఆసియా మార్కెట్లు ప్రారంభమయ్యేలోపు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank) కొనుగోలుకు సరైన వ్యక్తిని ఎంపిక చేయడం బెస్ట్ నిర్ణయం అని సెనెట్ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు మార్క్ వార్నర్ తెలిపారు. ఈ విషయమై తాను ఆశావాద దృక్పథంతో ఉన్నట్లు చెప్పారు. కాగా, ఎస్వీబీ వేలానికి శనివారం నుంచే ఎఫ్‌డీఐసీ చర్యలు ప్రారంభించింది. ఆదివారం కల్లా బిడ్లు ఖరారు అవుతాయని భావిస్తున్నట్లు అధికార వర్గాలను ఉటంకిస్తూ బ్లూంబర్గ్ ఓ వార్తాకథనం ప్రచురించింది. అయితే, సిలికాన్ వ్యాలీలో పేరొందిన ఇన్వెస్టర్లు.. ఎస్వీబీని ఆదుకునేందుకు ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగాలని కోరుతున్నారు. బ్యాంక్ డిపాజిటర్లకు గ్యారంటీ కల్పించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

