Gold – Gold & Silver ETFs | ఇన్వెస్టర్లకు లాభాల పంట.. బంగారం.. గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్‌పై రిటర్న్స్ ఎంతో తెలుసా.. ?!
Gold - Gold & Silver ETFs | జాతీయంగా, అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో బంగారం మీద 24 శాతం రిటర్న్స్ లభిస్తే, ఇన్వెస్టర్లకు బంగారం ప్లస్ సిల్వర్ ఈటీఎఫ్స్ మీద రమారమీ 20 శాతం రిటర్న్స్ లభించాయి.
Gold – Gold & Silver ETFs | బంగారం అన్నా, బంగారం ఆభరణాలు అన్నా, వెండి అన్నా భారతీయులకు ఎంతో ఇష్టం. పండుగలు, కుటుంబ వేడుకలు, ఇతర పర్వదినాల సందర్భంగా భారతీయ మహిళలు బంగారం కొనుగోలుకు మొగ్గుచూపుతుంటారు. వీలు కాకుంటే ఉన్న బంగారం ఆభరణాలే ధరించడానికి ఉత్సుకత ప్రదర్శిస్తుంటారు. రోజురోజుకు ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో పెట్టుబడులకు ప్రత్యామ్నాయ మార్గంగా కూడా బంగారం నిలుస్తోంది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.63,870 పలికింది. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లలో తులం బంగారం ధర రూ.79,200లకు చేరుకుంది. అంటే దాదాపు 24 శాతం బంగారం ధర పెరిగింది. ఇక కిలో వెండి ధర జనవరి ఒకటో తేదీన రూ.80 వేల వద్ద తచ్చాడితే శుక్రవారం రూ. 91,700 పలుకుతోంది. అంటే వెండి కొనుగోళ్లపై 16 శాతం రిటర్న్స్ లభిస్తున్నాయన్న మాట.
గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్‌పై 20 శాతం రిటర్న్స్
బంగారం దిగుమతులను నిరుత్సాహ పర్చడానికి కేంద్రం ఈటీఎఫ్ లు తీసుకొచ్చింది. ఫిజికల్ బంగారంతోపాటు డిజిటల్ బంగారంగా భావించే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులపై ఇన్వెస్టర్లకు ఈ ఏడాది దాదాపు 20 శాతం రిటర్న్స్ అందించాయి. ఇక వెండి ఈటీఎఫ్స్ మీద 19.66 శాతం రిటర్న్స్ లభించాయి. వివిధ బ్యాంకులు, సంస్థలు నిర్వహించిన ఈ ఈటీఎఫ్ ఫండ్స్ 31 వరకూ ఉన్నాయి. గోల్డ్ ఈటీఎఫ్స్ల్లో అత్యధికంగా హెచ్డీఎఫ్సీ గోల్డ్ ఈటీఎఫ్ నుంచి 20.30 శాతం రిటర్న్స్ వస్తే, ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఈటీఎఫ్ 20.29 శాతం లాభాలు గడించి పెట్టింది. ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్ 19.94 శాతం, యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్ కనిష్టంగా 19.66 శాతం రిటర్న్స్ మాత్రమే ఇన్వెస్టర్లకు అందించింది.
ఇక 17 సిల్వర్ ఈటీఎఫ్ ల్లోనూ హెచ్డీఎఫ్సీ సిల్వర్ ఈటీఎఫ్ మొదటి వరుసలో నిలిచింది. హెచ్డీఎఫ్సీ సిల్వర్ ఈటీఎఫ్ లో పెట్టుబడులపై అత్యధికంగా 22.02 శాతం, నిప్పన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ 20.33 శాతం, యూటీఐ సిల్వర్ ఈటీఎఫ్ 18.46 శాతం రిటర్న్స్ అందించాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదలకు అనుగుణంగా ఈటీఎఫ్ విలువ కూడా పెరుగుతుంది.2023లో గోల్డ్ ఈటీఎఫ్ లు సరాసరి 13 శాతం రిటర్న్స్ అందిస్తే, సిల్వర్ ఈటీఎఫ్ ల నుంచి ఇన్వెస్టర్లు 4.17 శాతం లాభాలు సంపాదించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

