Xiaomi 14 Ultra | భారత్ మార్కెట్లో షియోమీ ప్రీమియం ఫోన్ షియోమీ 14 ఆల్ట్రా ఆవిష్కరణ.. ధరెంతంటే..?!
Xiaomi 14 Ultra | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన ప్రీమియం ఫోన్ షియోమీ 14 ఆల్ట్రా ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Xiaomi 14 Ultra | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) తన ప్రీమియం ఫోన్ షియోమీ 14 ఆల్ట్రా (Xiaomi 14 Ultra) ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. షియోమీ తన ఆల్ట్రా వేరియంట్ ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించడం ఇదే తొలిసారి. గత నెలలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ-2024) సందర్భంగా గ్లోబల్ మార్కెట్లలో షియోమీ 14 ఆల్ట్రా (Xiaomi 14 Ultra) ఫోన్‌ను ఆవిష్కరించిన నెల లోపే భారత్ మార్కెట్లో ఆవిష్కరించడం గమనార్హం. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ (Qualcomm’s Snapdragon 8 Gen 3 SoC) చిప్సెట్తో వస్తున్న షియోమీ 14 ఆల్ట్రాతోపాటు షియోమీ 14 ఫోన్ కూడా జత కలుస్తుంది.
షియోమీ 14 ఆల్ట్రా (Xiaomi 14 Ultra) ఫోన్ 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.99,999 పలుకుతుంది. ఈ ఫోన్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ కొనుగోలుదారులకు షియోమీ మూడు నెలల యూ-ట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ (YouTube Premium subscription) కూడా ఆఫర్ చేస్తున్నది. ఈ ఫోన్ రిజర్వ్ ఎడిషన్ కూడా షియోమీ ప్రకటించింది. రూ.9,999 చెల్లించి ప్రీ-రిజర్వ్ ఆర్డర్ బుక్ చేసుకున్న వారికి వచ్చేనెల ఎనిమిదో తేదీన ఫోన్ లభిస్తుంది. ఈ నెల 11 నుంచి ప్రీ-రిజర్వ్ ఆప్షన్ ప్రారంభం అవుతుంది. షియోమీ అఫిషియల్ వెబ్సైట్, షియోమీ హోం ఔట్లెట్ల వద్ద ఏప్రిల్ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.5,000 డిస్కౌంట్, సెలెక్ట్ డివైజ్‌లు కొనుగోలు చేస్తే అదనంగా రూ.5,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది.
షియోమీ 14 ఆల్ట్రా (Xiaomi 14 Ultra) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 3,200 x 1,440 పిక్సెల్స్ రిజొల్యూషన్‌తో 6.73 అంగుళాల ఎల్టీపీఓ అమోలెడ్ మైక్రో కర్వ్డ్ డిస్ప్లే, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఓక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్‌సెట్‌తోపాటు 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగాబైట్ ఇన్‌బిల్ట్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ వర్షన్‌పై పని చేస్తుంది.
సర్క్యులర్ మాడ్యూల్లో క్వాడ్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుందీ షియోమీ 14 ఆల్ట్రా ఫోన్ (Xiaomi 14 Ultra). 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 900 ప్రైమరీ కెమరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తోపాటు రెండు 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్858 సెన్సర్ కెమెరాలు విత్ 3.2ఎక్స్ ఆప్టికల్ జూమ్ అండ్ 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ కలిగి ఉంటాయి. నాలుగో కెమెరా 50-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ లెన్స్‌తో వస్తున్నది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా కూడా ఉంటుంది.
90వాట్ల వైర్డ్, 80వాట్ల వైర్లెస్, 10వాట్ల వైర్లెస్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుందీ షియోమీ 14 ఆల్ట్రా (Xiaomi 14 Ultra). ఈ ఫోన్ 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, గ్లోనాస్, నావ్ ఐసీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. చార్జింగ్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్‌తో వస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

