Xiaomi 13 Ultra | గ్లోబల్ మార్కెట్లోకి త్వరలో షియోమీ 13 ఆల్ట్రా.. ఇవీ స్పెషిపికేషన్స్..!
Xiaomi 13 Ultra | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన ప్రీమియం ‘షియోమీ 13 ఆల్ట్రా’ ఫోన్ వచ్చేవారం గ్లోబల్ మార్కెట్లోకి రానున్నది.
Xiaomi 13 Ultra | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘షియోమీ’ త్వరలో తన ప్రీమియం ఫోన్.. షియోమీ 13 ఆల్ట్రా (Xiaomi 13 Ultra) ఫోన్ గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గత ఏప్రిల్‌లోనే చైనాలో ఈ ఫోన్ ఆవిష్కరించింది. షియోమీ 13 ఆల్ట్రా (Xiaomi 13 Ultra) ఫోన్‌ను హాంకాంగ్‌లో ఈ నెల ఏడో తేదీన ఆవిష్కరిస్తారు. భారత్‌తోపాటు యూరప్ యూనియన్ మార్కెట్లలోకి త్వరలో ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది.
హాంకాంగ్ లో గ్రీన్ కలర్ వేరియంట్‌గా వస్తున్నదని తెలుస్తున్నది. బ్యాక్ ప్యానెల్‌పై సర్క్యులర్ కెమెరా ఐలాండ్‌లో లైసా బ్రాండెడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఏర్పాటవుతుంది. ఇప్పటి వరకు గ్లోబల్ మార్కెట్లో షియోమీ 13 ఆల్ట్రా ధర అధికారికంగా వెల్లడించలేదు.
యూరప్ మార్కెట్లో 12 జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర దాదాపు రూ.1.33 లక్షలు (1499 యూరోలు) ఉండొచ్చు. చైనాలో 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.71,600 (5999 చైనా యువాన్లు), మిడ్ రేంజ్ 16 జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.77,500 (6499 చైనా యువాన్లు), టాప్ హై ఎండ్ ఫోన్ 16 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.87,000 (7299 చైనా యువాన్లు) గా ఉంది.
షియోమీ 13 ఆల్ట్రా ఫోన్ 6.73-అంగుళాల అమోలెడ్ డబ్ల్యూక్యూహెచ్డీ + (3200×1440 పిక్సెల్స్) డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్జ్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4ఎన్ఎం ఒక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్తో వస్తున్నది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ 14 వర్షన్ మీద ఫోన్ పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ 1-అంగుళాల ఐఎంఎక్స్989 ప్రైమరీ సెన్సర్ కెమెరాతో కూడిన లైకా ట్యూన్డ్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మూడు 50-మెగా పిక్సెల్ ఐఎంఎక్స్ 858 సెన్సర్ కెమెరాలు, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

