Whole Sale Inflation | పైపైకి ఆహార వస్తువుల ధరలు.. తొమ్మిది నెలల గరిష్టానికి డిసెంబర్ టోకు ద్రవ్యోల్బణం..!
Whole Sale Inflation | ఆహార వస్తువుల ధరలు పైపైకి పెరిగిపోతున్నాయి. ఫలితంగా నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ).. హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 0.73శాతం పెరిగింది.
Whole Sale Inflation | ఆహార వస్తువుల ధరలు పైపైకి పెరిగిపోతున్నాయి. ఫలితంగా నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ).. హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 0.73శాతం పెరిగింది. నవంబర్ టోకు ద్రవ్యోల్బణం 0.26 శాతంగా నమోదైంది. గతేడాది మార్చిలో 1.34 శాతంగా నమోదైన టోకు ద్రవ్యోల్బణం.. ఏప్రిల్‌లో -0.92 శాతానికి పతనమైంది. కానీ, ఏడు నెలల తర్వాత నవంబర్ నెలలో 0.26 శాతం ద్రవ్యోల్బణం రికార్డయింది. ఏప్రిల్ తర్వాత దాదాపు అదే స్థాయిలో డిసెంబర్ టోకు ద్రవ్యోల్బణం పెరిగింది.
కానీ నవంబర్ నాటికి ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో టోకు ద్రవ్యోల్బణం పైపైకి దూసుకెళ్లింది. ఏప్రిల్‌లో నెగెటివ్ జోన్లోకి పడిపోయిన హోల్‌సేల్ ద్రవ్యోల్బణం.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పుంజుకున్నది. ఆహార వస్తువులు, మెషినరీ అండ్ ఎక్విప్మెంట్, మాన్యుఫాక్చరింగ్, రవాణా వస్తువులు, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఆప్టికల్ ఉత్పత్తుల ధరలు పెరిగాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
నవంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 8.18 శాతం నమోదు కాగా, డిసెంబర్ నెలలో 9.38 శాతానికి పెరిగింది. కూరగాయల ధరలు 26.30 శాతం, పప్పు ధాన్యాలు 19.60 శాతం పెరిగాయి. మరోవైపు డిసెంబర్ రిటైల్ ద్రవ్యో్ల్బణం నాలుగు నెలల గరిష్ట స్థాయి 5.69 శాతానికి దూసుకెళ్లింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆహార ధరల పెరుగుదల నేపథ్యంలో గత నెలలో ద్రవ్య పరపతి సమీక్ష జరిపిన ఆర్బీఐ.. కీలక వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగించింది.
గత ఏప్రిల్‌లో బేసిక్ మెటల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, మినరల్ ఆయిల్స్, టెక్స్టైల్స్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్, కెమికల్ అండ్ కెమికల్ ప్రొడక్ట్స్, రబ్బర్ అండ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు, పేపర్ అండ్ పేపర్ ప్రొడక్ట్స్ ధరలు తగ్గాయి. ఫలితంగా ఏప్రిల్ టోకు ద్రవ్యోల్బణం భారీగా తగ్గింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

