ChatGPT | చాట్‌జీపీటీతో కొలువు కోల్పోయిన కాపీరైటర్
చాట్‌జీపీటీ (ChatGPT) వంటి ఏఐ టూల్స్‌తో కొలువుల కోత తప్పదనే ఆందోళన వ్యక్తమవుతుండగా, న్యూ టెక్నాలజీపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది.
న్యూఢిల్లీ : చాట్‌జీపీటీ (ChatGPT) వంటి ఏఐ టూల్స్‌తో కొలువుల కోత తప్పదనే ఆందోళన వ్యక్తమవుతుండగా, న్యూ టెక్నాలజీపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. పలు కంపెనీలు ఏఐ టూల్స్‌తో ఉద్యోగులను రీప్లేస్ చేస్తుండగా తాజాగా చాట్‌జీపీటీతో తన ఉద్యోగం ఊడిందని ఓ మహిళ వెల్లడించింది. ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగానే తాను కొలువును కోల్పోయానని చేయి తిరిగిన రచయిత, స్టాండప్ కమెడియన్‌గా పేరొందిన మహిళ తెలిపింది.
ఎన్నో ఏండ్లుగా కాపీ రైటర్‌గా ఈ క్రియేటివ్ ఫ్రీలాన్సర్ పనిచేస్తూ వివిధ బ్రాండ్లకు కంటెంట్ అందిస్తోంది. ఏఐ రాకతో క్రమంగా ఆమె జీవనోపాధి కనుమరుగైంది. ముందుగా ఆమెకు పని క్రమంగా తగ్గుతూ రాగా, ఆమె తన టాలెంట్‌పై సందేహంలో మునిగితేలింది. అయితే ఆమె నైపుణ్యాల్లో పసతగ్గలేదని, తన ఫ్రీలాన్స్ వర్క్ తగ్గడానికి కారణం చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌ను ఆయా సంస్ధలు వినియోగించడమేనని వెల్లడైంది. ఏఐ ఆధారిత రైటింగ్ టూల్స్ అందుబాటులోకి రావడంతో క్రియేటివ్ రైటర్లు, కాపీ రైటర్లు, కంటెంట్ క్రియేటర్ల ఉద్యోగాలకు ఎంతటి ముప్పు పొంచిఉందో మహిళ ఉదంతం వెల్లడిస్తోంది.
ఆమె క్లైంట్లు చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు, లేటెస్ట్ బ్రాండ్లు కావడంతో ఖర్చు తగ్గించుకునేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగించేందుకు మొగ్గుచూపడంతో మహిళ జీవనాధారం దెబ్బతిన్నది. ఇక తనకు పని తగ్గిపోవడంతో నూతన అవకాశాల కోసం ఆమె వేచిచూస్తున్నారు. చాట్‌జీపీటీ లాంఛ్ అయిన రెండు నెలలకే ఏకంగా పది కోట్ల మంది యూజర్లను ఆకట్టుకోగా ఏఐ టూల్స్‌కు ఎంతటి ఆదరణ ఉందో అర్దమవుతోంది. మరోవైపు న్యూ టెక్నాలజీతో వేలాది మంది ఉపాధి ప్రశ్నార్ధకమవుతున్నదని తాజా ఉదంతం చాటుతున్నది.
Read More :
Apple GPT AI | చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్‌కు దీటుగా త్వరలో యాపిల్ జీపీటీ ఏఐ
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- ChatGPT
- job
- replacement
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

