Wholesale Inflation | 8 రెట్లు పెరిగిన కూరగాయల ధరలు.. డిసెంబర్ టోకు ద్రవ్యోల్బణం ఎంతంటే?!
Wholesale Inflation | గత నెలలో కూరగాయల ధరలు ఎనిమిది రెట్లు పెరిగాయి. టోకు ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్ దాటింది.

Wholesale Inflation | గత నెలలో కూరగాయల ధరలు ఎనిమిది రెట్లు పెరిగాయి. టోకు ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో నమోదైనా నవంబర్ కంటే తక్కువగా ఉండటం కాసింత ఉపశమనాన్నిస్తున్నది. నవంబర్‌లో హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 14.23 శాతం. గత తొమ్మిది నెలలుగా టోకు ధరల సూచీ పది శాతానికి పైగా నమోదవుతున్నది. నవంబర్‌లో కేవలం 3.91 శాతం పెరిగిన కూరగాయల హోల్‌సేల్ ధరలు గత నెలలో భారీగా 31.56% పెరిగిపోయాయి. గత నెలలో దాదాపు ఎనిమిది రెట్లు కూరగాయల ధరలు పెరిగాయి.
30 ఏండ్లలో గరిష్ఠ ద్రవ్యోల్బణం
1991 డిసెంబర్ తర్వాత నవంబర్‌లో గరిష్ఠ ద్రవ్యోల్బణం నమోదైంది. రిటైల్, హోల్‌సేల్ షాపుల్లోనూ సరుకులు కొనుగోలు చేయొచ్చు. పెద్ద డీలర్ వద్ద హోల్‌సేల్ ధరకు కొంటే.. రిటైల్ డీలర్ దగ్గర కాస్త ధర పెరుగుతుంది. 2020 డిసెంబర్‌తో పోలిస్తే 1.95 శాతం ధరలు పెరిగాయి. దాదాపు ఏడు రెట్లు ఎక్కువయ్యాయి. ఉత్పత్తి రంగ ద్రవ్యోల్బణం నవంబర్‌తో పోలిస్తే 11.92 నుంచి 10.62 శాతానికి దిగి వచ్చింది. ఫిష్, మటన్, చేపల ధరలు 6.68 శాతం. నవంబర్‌లో ఇది 9.66%.
ద్రవ్యోల్బణం పెరుగుదలకు పలు కారణాలు
టెక్స్టైల్స్, పేపర్, ఆయిల్స్, మెటల్స్, క్రూడాయిల్, కెమికల్, ఫుడ్ ప్రొడక్స్ ధరలు పెరగడం వల్లే గత నెలలో ద్రవ్యోల్బణం పైపైకి దూసుకెళ్లిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ తెలిపింది. నవంబర్‌తో పోలిస్తే ఉల్లిగడ్డల ధరలు తగ్గాయని పేర్కొంది. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో ఉల్లిగడ్డల ధరలు 30.10 నుంచి 19.08 శాతానికి దిగి వచ్చాయి. బంగాళా దుంపలు కూడా. విద్యుత్, ఇంధన ధరలు 39.81 నుంచి 32.30 శాతానికి పతనం అయ్యాయి.
ఆహార ద్రవ్యోల్బణం ఇలా
అయితే, ఆహార ద్రవ్యోల్బణంలో గ్రోత్ నమోదైంది. గత నవంబర్‌లో 6.70 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం.. డిసెంబర్లో 9.24 శాతానికి పెరిగింది. గతేడాది ఏప్రిల్ నుంచి టోకు ధరల సూచి 10 శాతం పైనే నమోదవుతున్నది. టోకు ద్రవ్యోల్బణంలో ఉత్పత్తి రంగానికి 65 శాతం ఉంటుంది. ఇందులో కార్లు, టీవీలు, మొబైల్స్, బట్టలు, భారీ యంత్రాల వస్తువులు ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్ 20 శాతం.. ఫ్యూయల్ అండ్ కరంట్ 13 శాతం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

