Recurring deposits | రికరింగ్ డిపాజిట్లకు పోస్టాఫీస్, ఎస్బీఐలలో ఏది ఉత్తమం.. వడ్డీ రేటు ఎందులో ఎక్కువ?
నెలవారీ స్థిర ఆదాయాన్ని ఆర్జించేవారిలో చాలామంది పొదుపు సాధనంగా రికరింగ్ డిపాజిట్లు (ఆర్డీలు) ఎంచుకుంటుంటారు. మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్‌లు) తరహాలోనే నెలకి కొంత చొప్పున ఆర్డీల్లో జమచేసుకోవచ్చు. ఈ రికరింగ్ డిపాజిట్ల కాలపరిమితి ఒక ఏడాది నుంచి పదేండ్ల వరకూ ఉంటుంది.
Recurring deposits | నెలవారీ స్థిర ఆదాయాన్ని ఆర్జించేవారిలో చాలామంది పొదుపు సాధనంగా రికరింగ్ డిపాజిట్లు (ఆర్డీలు) ఎంచుకుంటుంటారు. మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్‌లు) తరహాలోనే నెలకి కొంత చొప్పున ఆర్డీల్లో జమచేసుకోవచ్చు. ఈ రికరింగ్ డిపాజిట్ల కాలపరిమితి ఒక ఏడాది నుంచి పదేండ్ల వరకూ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర పలు బ్యాంక్‌లతో పాటు పోస్టాఫీసు సైతం ఆర్డీలను ఆఫర్ చేస్తున్నాయి. సంస్థకు అనుగుణంగా వడ్డీ రేట్లలో మార్పులుంటాయి. వీటిలో బహుళ ప్రాచుర్యం పొందిన పోస్టాఫీస్ ఆర్డీ, ఎస్బీఐ ఆర్డీల వివరాలు పరిశీలించి ఏది ఉత్తమమో తెలుసుకుందాం…
ఆర్డీలపై పన్ను నిబంధనలు
రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి టాక్స్ డిడెక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్) వర్తిస్తుంది. ఆర్డీలపై రూ. 10,000 మించి వడ్డీ ఆదాయం లభిస్తే 10 శాతం టీడీఎస్ కట్ అవుతుంది.
ద్రవ్యోల్బణం ముందు దిగదుడుపే
వాస్తవానికి ఐదేండ్ల ఆర్డీపై ఇటు ఎస్బీఐ. అటు పోస్టాఫీసు..రెండూ ఆఫర్ చేసే వడ్డీ రేటు ఒకే స్థాయిలో ఉన్నాయి. కానీ ఇవి రెండూ దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడినివ్వడం లేదంటూ నిపుణులు వాపోతున్నారు. 2023 జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠస్థాయి 7.44 శాతానికి చేరగా, అంతకంటే తక్కువగానే ఆర్డీలపై వడ్డీ లభిస్తున్నది. ఎటువంటి రిస్క్ లేకుండా పొదుపు ఖాతాకంటే మెరుగైన వడ్డీ రేటును ఇస్తే చాలు అని భావించేవారికి మాత్రమే ఆర్డీ ఒక పొదుపు సాధనం.

ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్
ఒక ఏడాది నుంచి పదేండ్ల కాలపరిమితికి రికరింగ్ డిపాజిట్లను ఎస్బీఐ అనుమతిస్తున్నది. నెలకు కనీస డిపాజిట్ మొత్తం రూ.100కాగా, ఆపై రూ.10 గుణిజాలలో మదుపు చేసుకోవచ్చు. ఆర్డీలపై 6.5 శాతం నుంచి 7 శాతం వరకూ వడ్డీ ఇస్తున్నది. సీనియర్ సిటిజన్లకు 0.5 శాతం అదనంగా 7 నుంచి 7.5 శాతం అందిస్తున్నది. ఈ రేట్లు 2023 ఫిబ్రవరి నుంచి అమల్లో ఉన్నాయి.
వడ్డీ రేట్ల వివరాలు..
- ఏడాది నుంచి రెండేండ్ల లోపు ఆర్డీలకు 6.8 శాతం (సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం)
- 2-3 ఏండ్ల మధ్య ఆర్డీలకు 7 శాతం (సీనియర్లకు 7.50 శాతం)
- 3-5 ఏండ్ల మధ్య ఆర్డీలకు 6.5 శాతం (సీనియర్లకు 7 శాతం)
- 5-10 ఏండ్ల మధ్య ఆర్డీలకు 6.50 శాతం (సీనియర్లకు 7.50 శాతం)

పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్
పోస్టాఫీసు ఆర్డీకి ఐదేండ్ల కాలపరిమితి ఉంటుంది. నెలవారీ కనీస పొదుపు మొత్తం రూ. 100 కాగా ఆపై రూ.10 గుణిజాల్లో చెల్లించవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. పోస్టాఫీసు ఆర్డీల్లో సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేటు ఆఫర్ లేదు.
వడ్డీ రేటు: పోస్టాఫీసు ఐదేండ్ల ఆర్డీపై తాజా వడ్డీ రేటు 6.5 శాతం ఉంది. ఈ రేటు 2023 జూలై 1 నుంచి అమలులో ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

