WhatsApp | డీప్ ఫేక్ గుర్తించేందుకు వాట్సాప్ హెల్ప్ లైన్ ఇలా..!
WhatsApp | డీప్ ఫేక్`ను గుర్తించడానికి మెటా అనుబంధ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బేస్డ్ చాట్‌బోట్‌తో కూడిన హెల్ప్‌లైన్ అందుబాటులోకి తేనున్నది.
WhatsApp | అత్యాధునిక టెక్నాలజీ.. ప్రత్యేకించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బేస్డ్ డీప్ ఫేక్స్, వాయిస్ రికార్డులు వస్తుండటంతో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ వాటి భారీన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటా ఇందుకోసం స్పెషల్ హెల్ప్ లైన్ ఏర్పాటు ఏర్పాటు చేయనున్నది. ఇంగ్లిష్‌తోపాటు చాట్ బోట్ ఫామ్‌లో వాట్సాప్ హెల్ప్‌లైన్ మూడు భాషలతో (హిందీ, తమిళం, తెలుగు) ఉంటుంది. ఈ హెల్ప్ లైన్ నంబర్‌కు చాట్ బోట్ ద్వారా యూజర్లు టెక్ట్స్, ఇమేజ్, వీడియో మెసేస్ లపై దర్యాప్తు కోసం పంపొచ్చు. ఇందుకోసం మిస్ ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయెన్స్ (ఎంసీఏ)తో భాగస్వామ్యం అవుతున్నామని మెటా తెలిపింది. వచ్చే నెల నుంచి ప్రజలకు ఈ హెల్ప్ లైన్ వినియోగంలోకి వస్తుంది.
మెటా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ శివనాథ్ థుక్రాల్ మాట్లాడుతూ ప్రజలకు వచ్చే తప్పుడు సమాచారాన్ని ఏఐ ద్వారా గుర్తించవచ్చునన్నారు. ఇందుకు యావత్ టెక్నాలజీ పరిశ్రమ స్పష్టమైన, తప్పనిసరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎంసీఏ చైర్మన్ భారత్ గుప్తా మాట్లాడుతూ భారత్ లోని ఇంటర్నెట్ యూజర్లు, సోషల్ మీడియా యూజర్లకు వచ్చే తప్పుడు సమాచారం విస్తరించకుండా తప్పనిసరి చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా తమ యూజర్లు ఎటువంటి `తప్పుడు సమాచారం లేదా డీప్ ఫేక్స్’ పోస్ట్ చేయకుండా చట్టబద్ధమైన బాధ్యత కలిగి ఉండాలని కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
Jupally Krishna Rao | మంత్రి జూపల్లిని విమర్శించారని.. యువకుడిని చితకబాదిన ఎస్సై
Nereducherla | బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడి!
Journalist Shankar | ప్రశ్నించినందుకు జర్నలిస్టు శంకర్ అరెస్ట్.. మెడికవర్ యాజమాన్యం ఫిర్యాదుపై కేసు
Asian Para Games | భారత్‌కు ఒక్క రోజే 26 మెడల్స్.. 2 స్వర్ణాలతో మెరిసిన ఆర్చర్ శీతల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

