Wedding Business | ఈ సీజన్లో 42లక్షలకుపైగా పెళ్లిళ్లు..! రూ.5.5లక్షల కోట్ల వ్యాపారం..!
Wedding Business | దేశవ్యాప్తంగా భారీగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా దాదాపు 42లక్షలకుపైగా వివాహాలు జరుగనున్నట్లు అంచనా. ఇందులో దేశ రాజధాని ఢిల్లీలోనే నాలుగు లక్షకుపైగా వివాహాలు జరుగుతాయని అంచనా. వివాహ వేడుకల నేపథ్యంలో రూ.5.5లక్షల కోట్లకుపైగా వ్యాపారం జరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
Wedding Business | దేశవ్యాప్తంగా భారీగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా దాదాపు 42లక్షలకుపైగా వివాహాలు జరుగనున్నట్లు అంచనా. ఇందులో దేశ రాజధాని ఢిల్లీలోనే నాలుగు లక్షకుపైగా వివాహాలు జరుగుతాయని అంచనా. వివాహ వేడుకల నేపథ్యంలో రూ.5.5లక్షల కోట్లకుపైగా వ్యాపారం జరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పెళ్లి బట్టలు, బంగారు ఆభరణాలు, వాహనాలతో పాటు పెళ్లిళ్ల భోజనాలకు సంబంధించి భారీగా డిమాండ్ సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ నిత్యవసర సరుకుల వస్తువులకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో జూలై 15 వరకు దేశవ్యాప్తంగా దాదాపు 42 లక్షల వివాహాలు జరగనున్నాయి.
దాంతో దాదాపు రూ.5.5 లక్షలకోట్ల వరకు మార్కెట్లో కొనుగోళ్లు జరగవచ్చని ట్రేడర్స్ బాడీ క్యాట్ చీఫ్ ఆఫీసర్ సుమిత్ అగర్వాల్ తెలిపారు. వివాహ సంబంధిత వస్తువుల కొనుగోళ్ల ద్వారా భారీగా నగదు మార్కెట్లోకి ప్రవేశిస్తుందన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ను విదేశాల్లో కాకుండా దేశంలోనే వివిధ ప్రాంతాల్లోనే నిర్వహించుకోవాలన్న ప్రధాని విజ్ఞప్తి సైతం ప్రజలపై పెను ప్రభావం చూపిందని పేర్కొన్నారు. దాంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ జరిగే వేదికలు జూలై వరకు పూర్తిగా బుక్ అయ్యాయని తెలిపారు. గతేడాది డిసెంబర్ 14తో ముగిసిన పెళ్లిళ్ల సీజన్లో దాదాపు 35లక్షల వరకు జరిగాయి. ఈ సీజన్లో రూ.4.25లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు అంచనా. గత సీజన్‌తో పోలిస్తే రూ.1.25లక్షల కోట్లు అదనంగా జరుగుతుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

