బంజారాహిల్స్, మే 4: యువతలో ఉన్న సృజనాత్మక ఆవిష్కరణలకు తెలంగాణ సర్కార్ అన్ని రకాలుగా ప్రోత్సాహకాలను అందిస్తున్నదని వీ హబ్ సీఈవో దీప్తి రావుల అన్నారు. సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ‘ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మీట్’కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం స్టార్టప్ సంస్థలకు అనువైన వాతావరణం ఉన్నదని, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ సంస్థలకు కావాల్సిన ప్రోత్సాహాన్ని అందించేందుకు టీహబ్, టీవర్క్స్, వీహబ్, టాస్క్ తదితర వేదికలను ఏర్పాటు చేసిందన్నారు. ఇన్నోవేటివ్ ఐడియాలతో ముందుకు వచ్చేవారికి సరైన మార్గనిర్దేశనం లభిస్తుందన్నారు. మహిళా వ్యాపారవేత్తలు సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్తే అద్బుత విజయాలు సాధించగలరన్నారు.