క్రిప్టో ఇన్వెస్టర్లకు ఊరట.. ఇక ఐటీఆర్ దాఖలు సులభం
గత కొన్నేండ్లుగా క్రిప్టో కరెన్సీల్లో మదుపు చేసేవారు క్రమేణా పెరుగుతున్నారు. అయితే ఏటా ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్స్ దాఖలు చేయాలంటే మాత్రం వీరికి తిప్పలు తప్పడం లేదు. ఈ క్రమంలోనే భారతీయ క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్ వజీర్ఎక్స్.. ఓ ఉచిత పన్ను నివేదిక సాధనాన్ని తీసుకొచ్చింది.
- ‘ట్యాక్స్లిస్ట్’ టూల్‌ను తెచ్చిన వజీర్ఎక్స్
న్యూఢిల్లీ, జూలై 28 : గత కొన్నేండ్లుగా క్రిప్టో కరెన్సీల్లో మదుపు చేసేవారు క్రమేణా పెరుగుతున్నారు. అయితే ఏటా ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్స్ దాఖలు చేయాలంటే మాత్రం వీరికి తిప్పలు తప్పడం లేదు. ఈ క్రమంలోనే భారతీయ క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్ వజీర్ఎక్స్.. ఓ ఉచిత పన్ను నివేదిక సాధనాన్ని తీసుకొచ్చింది. ఐటీఆర్ దాఖలుకు గడువు తేదీ దగ్గరపడుతున్న క్రమంలో క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టిన మదుపర్లకు ఊరటనిస్తూ ‘ట్యాక్స్లిస్ట్’ పేరిట ఫ్రీ క్రిప్టో ట్యాక్స్ రిపోర్టింగ్ వేదికను మంగళవారం పరిచయం చేసింది.
దీంతో ఇక రకరకాల క్రిప్టో ఎక్సేంజీలలో జరిపిన లావాదేవీలకు సంబంధించి సులువుగానే ఇన్వెస్టర్లు తమ పన్ను నివేదికలను ఈ టూల్ ద్వారా అందుకోవచ్చని వజీర్ఎక్స్ చెప్తున్నది. ఏ ఎక్సేంజ్ నుంచైనాసరే మదుపర్లు తమ లావాదేవీల చరిత్రలను ట్యాక్స్లిస్ట్ ప్లాట్‌ఫామ్‌పై అప్లోడ్ చేసి లాభాలు, నష్టాలు, చెల్లించాల్సిన పన్ను వివరాల నివేదికలను నిమిషాల్లో పొందవచ్చని ఈ సందర్భంగా వజీర్ఎక్స్ తెలిపింది. క్రిప్టో ట్యాక్స్ లెక్కింపును సులభతరం చేసేలా ఈ సాధనాన్ని డిజైన్ చేశామని, ట్యాక్స్లిస్ట్ దానంతటదే వర్చువల్ డిజిటల్ అసెట్ (వీడీఏ) సహా అన్నింటి లాభనష్టాలను అంచనా వేసి కచ్చితమైన రిపోర్టును ఇస్తుందన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పుట్టపాక వాసి విజయ్‌కుమార్‌కు గణిత శాస్త్రంలో జేఎన్టీయూ డాక్టరేట్
Hey Kannamma | యశ్ మాస్టర్, ధనశ్రీ వర్మ జోడిగా ‘హే కన్నమ్మ’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!
Septic tank | బాచుపల్లిలో విషాదం..సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ముగ్గురుయువులు మృతి
16వ సారి రక్తదానం.. మరోసారి మానవత్వం చాటిన రవితేజ
Chlorination gas leak | ఎన్టీఆర్ జిల్లాలో క్లోరినేషన్ గ్యాస్ లీక్.. భయాందోళనలో గ్రామస్థులు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

