CIBIL Score | మీ సిబిల్ స్కోర్ పెంచుకోండిలా?
సిబిల్ స్కోర్.. దీని ఆధారంగానే బ్యాంకు లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు ఎవరికైనా రుణాలిస్తాయి, దానిపై వడ్డీరేట్లను నిర్ణయిస్తాయి. కాబట్టి తప్పకుండా మన క్రెడిట్ స్కోర్ బాగుండాల్సిందే.
CIBIL Score | సిబిల్ స్కోర్.. దీని ఆధారంగానే బ్యాంకు లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు ఎవరికైనా రుణాలిస్తాయి, దానిపై వడ్డీరేట్లను నిర్ణయిస్తాయి. కాబట్టి తప్పకుండా మన క్రెడిట్ స్కోర్ బాగుండాల్సిందే. అయితే ఈ స్కోర్ పెరగడానికి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. కనుక వీటిని మర్చిపోవద్దు.
చెల్లింపులు: మీరు తీసుకున్న రుణాలకు సంబంధించి చేస్తున్న చెల్లింపుల తీరు మీ క్రెడిట్ స్కోరును అధికంగా ప్రభావితం చేయగలదు. సకాలంలో లోన్ పేమెంట్స్ ఉన్నైట్టెతే క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. ఆలస్యమైతే తగ్గుతుంది. అయితే అనవసరంగా లోన్ గ్యారంటీలకు వెళ్లకపోవడమే మంచిది.
తక్కువ రుణ భారం: విచ్చలవిడిగా తీసుకునే రుణాలూ మన క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తాయి. కాబట్టి అనవసరంగా అప్పులు చేయవద్దు. అవసరమైతే తప్ప రుణాల కోసం బ్యాంకుల్లో విచారణలూ చేయకపోవడం ఉత్తమం.
క్రెడిట్ నివేదిక తనిఖీ: మీ క్రెడిట్ స్కోర్‌ను తరచూ చెక్ చేసుకోవాలి. దీనివల్ల మీ రుణదాతలు చేసిన పొరబాట్లను గుర్తించి, సరిచేసుకోవచ్చు. రుణదాతలిచ్చే సమాచారం ప్రకారమే సిబిల్ స్కోర్ పెరగడం, తగ్గడం ఉంటుంది. కొన్నిసార్లు మన క్రెడిట్ స్కోర్‌ను అప్డేట్ చేయడం బ్యాంకర్లు మర్చిపోతారు. రుణాల చెల్లింపు వివరాలు సిబిల్‌కు ఇవ్వకపోవడం వల్ల నష్టపోతాం. ఆన్లైన్లో ఉచితంగానే క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోవచ్చు.
ఇంకా: మీరు ఏయే రుణాలను తీసుకుంటున్నారనేదానిపైనా మీ సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. వాటిని ఎంత బాధ్యతాయుతంగా చెల్లిస్తున్నారన్నది కీలకం. కనుక వాహన, గృహ, వ్యక్తిగత, విద్య, క్రెడిట్ కార్డు, గృహోపకరణాల రుణాల నెలవారీ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ)ను మరువద్దు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- CIBIL
- cibil score
- loans
- nbfc
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

