WhatsApp | వాట్సాప్‌లో ప్రైవసీ కాపాడుకోవాలంటే ఏం చేయాలో తెలుసా..?!
WhatsApp | వాట్సాప్ లో కొత్తగా ఏర్పాటు చేసే గ్రూపుల్లో చేరకుండా అడ్డుకోవడానికి కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఆ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే చాలు.. మన పర్మిషన్ లేకుండా ఇతరులెవ్వరూ కొత్త గ్రూపులో యాడ్ చేయలేరు.
WhatsApp | అందుబాటులోకి స్మార్ట్ ఫోన్లు వచ్చాక మెసేజ్ లు పంపడానికి ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వచ్చింది. దాంట్లో కొంతమంది గ్రూపుగా చేరిపోవచ్చు.. అయితే, ఇటీవలి కాలంలో ఇతరులు సంబంధిత వ్యక్తి అనుమతి పొందకుండానే మనల్ని వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేస్తారు. ఇలా చేయడం కొందరు ఇబ్బందిగా భావిస్తుంటారు. అలాగని వారు బయటకు రాలేరు.. ఆ గ్రూపులో కొనసాగడానికి ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారికి.. ఇబ్బంది రాకుండా వాట్సాప్ లో ఉన్న ఒక ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే చాలు.. మన పర్మిషన్ లేకుండా ఇతరులెవ్వరూ కొత్త గ్రూపులో యాడ్ చేయలేరు. అదేలాగో తెలుసుకుందాం..
వాట్సాప్ లో పైన కుడి వైపున కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేసి.. ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి ‘ప్రైవసీ’ ఆప్షన్ ఎంచుకోవాలి.. కిందకు స్క్రోల్ చేస్తూ ‘గ్రూప్స్’ అనే ఆప్షన్ వస్తుంది. గ్రూప్ ఆప్షన్ ట్యాప్ చేయాలి. అందులో ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అనే ఆప్షన్లలో ఎవ్రీ వన్ కాకుండా మిగతా ఆప్షన్లు ఎంచుకుంటే.. మనల్ని ఎవరైనా గ్రూప్ లో యాడ్ చేయాలని భావిస్తే ‘ఇన్వైట్’ లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి గ్రూపులో యాడ్ కావచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

