Vodafone Idea | యూజర్లకు వొడాఫోన్ ఐడియా రెండు కొత్త ప్లాన్లు.. ఇవీ డిటైల్స్
Vodafone Idea | ఆర్థిక ఇబ్బందులతో 5జీ సేవల ప్రారంభంలో వెనకబడ్డా.. తన యూజర్ల కోసం వొడాఫోన్ ఐడియా సూపర్ అవర్, సూపర్ డే పేరిట రెండు కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్లు తీసుకొచ్చింది.
Vodafone Idea | రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్‌తో పోలిస్తే 5జీ సేవల ప్రారంభంలో వెనకబడింది వొడాఫోన్ ఐడియా. కానీ, యూజర్లకు ప్రీ-పెయిడ్ ఆపర్లు, న్యూ ప్లాన్స్ ప్రకటించడంలో వెనుకాడటం లేదు. తాజాగా తన యూజర్లకు షార్ట్ టైం ఫ్రేంలో క్విక్ డేటా రీచార్జీ ప్లాన్లు తీసుకొచ్చింది. సూపర్ అవర్, సూపర్ డే డేటా ప్యాక్‌లు తీసుకొచ్చిన వొడాఫోన్ ఐడియా.. ఆ స్వల్పకాలంలో అపరిమితమైన డేటా ఉపయోగించుకోవచ్చు.
సూపర్ అవర్ ప్లాన్ కోసం రూ.24, సూపర్ డే ప్లాన్ కోసం రూ.49 చెల్లిస్తే సరిపోతుంది. కాలేజీ ప్రాజెక్ట్, టీవీ షో స్ట్రీమింగ్, వీడియో గేమ్ ప్లే వంటి వాటి కోసం ఈ ప్లాన్లు ఉపకరిస్తాయి. యాడ్ ఆన్ డేటా ఆప్షన్ కింద ఈ ప్లాన్లు కొనుగోలు చేస్తే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని వొడాఫోన్ ఐడియా తెలిపింది.
సూపర్ అవర్ ప్లాన్ కింద రూ.24 చెల్లిస్తే.. ఆ గంట సేపు ఇంటర్నెట్ సేవలు, 4జీ డేటా అపరిమితంగా అందుకోవచ్చు. గంట గడువు ముగిసిన తర్వాత యాక్టివ్ రీచార్జి ప్లాన్‌ను బట్టి ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతూ ుంటుంది.
సూపర్ డే ప్లాన్ కింద 24 గంటల పాటు అపరిమిత డేటా అందుకోవచ్చు. రూ.49లకు హైస్పీడ్ 4జీ ఇంటర్నెట్ డేటా పొందొచ్చు. దీని ద్వారా 6జీబీ డేటా అందుకోసవచ్చు. భారీగా డేటా అవసరమైన యువకులను లక్ష్యంగా చేసుకుని వొడాఫోన్ ఐడియా ఈ ప్లాన్లు తెచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

