Vivo Y58 5G | వివో ఆఫర్.. డిస్కౌంట్‌పై వివో వై58 5జీ ఫోన్..!
Vivo Y58 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వై58 5జీ ఫోన్ మీద రూ.1000 ధర తగ్గించేసింది.
Vivo Y58 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వై58 5జీ (Vivo Y58 5G) ఫోన్‌ను గత జూన్ నెలలో ఆవిష్కరించింది. 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ మీద పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా యూనిట్ తో వస్తున్న వివో వై58 5జీ ఫోన్ సింగిల్ ర్యామ్ అండ్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తోంది. ఆఫ్‌లైన్, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ మీద లభిస్తున్న ఈ ఫోన్ ధర తగ్గించివేసింది.
వివో వై58 5జీ (Vivo Y58 5G) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.18,499లకు లభిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, దేశవ్యాప్తంగా భాగస్వామ్య రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. వివో వై58 5జీ ఫోన్ ఆవిష్కరణ సమయంలో రూ.19,499గా ధర నిర్ణయించారు. హిమాలయన్ బ్లూ, సుందర్బాన్స్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉందీ ఫోన్.
వివో వై58 5జీ (Vivo Y58 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2408 పిక్సెల్స్ 2.5 డీ ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. 4 ఎన్ఎం క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్ తో పని చేస్తుంది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఫోన్ స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుంది.
వివో వై58 5జీ (Vivo Y58 5G) ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తోపాటు 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ కెమెరా ఉంటాయి. 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తుంది. నాలుగేండ్ల పాటు బ్యాటరీ లైఫ్ హామీ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

