Vivo Y18i | బడ్జెట్ ధరలో వివో వై18ఐ.. ఇవీ డిటెయిల్స్..!
Vivo Y18i | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వై18ఐ (Vivo Y18i) ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Vivo Y18i | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వై18ఐ (Vivo Y18i) ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రూ.10 వేల లోపు ధరకే లభించే వివో వై18ఐ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, యూనీసోక్ టీ612 చిప్ సెట్, ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేయనున్నది. 13 -మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 6.56 అంగుళాల ఎల్ సీడీ స్క్రీన్ విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు కలిగి ఉంటుంది.
వివో వై18ఐ (Vivo Y18i) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,999లకు లభిస్తుంది. జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే కంపెనీ ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్, క్రోమా వంటి రిటైల్ షోరూమ్స్ లో లభిస్తున్నది. వివో వై18ఐ (Vivo Y18i) ఫోన్ 60-90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.56 అంగుళాల హెచ్డీ+ (720×1612 పిక్సెల్స్) ఎల్ సీడీ స్క్రిన్ కలిగి ఉంటుంది. 528 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తోంది. 12 ఎన్ఎం ఒక్టాకోర్ యూనిసోక్ టీ 612 చిప్ సెట్ కలిగి ఉంటుంది.
వివో వై18ఐ (Vivo Y18i) ఫోన్ 13-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 0.08 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా, సెల్ఫీలూ వీడియోకాల్స్ కోసం 5-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్ వరకూ పెంచుకోవచ్చు. వై-ఫై5, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, అంబియెంట్ లైట్ సెన్సర్ ఉంటాయి. 15వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

