Vivo V29 |ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) సుదీర్ఘ విరామం తర్వాత తన వివో వీ29 సిరీస్ ఫోన్లు.. వివో వీ29 (Vivo V29), వివో వీ29 ప్రో (Vivo V29 Pro) భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. వివో వీ29 (Vivo V29) ఫోన్ మూడు కలర్ ఆప్షన్లు – హిమాలయన్ బ్లూ, మేజిస్టిక్ రెడ్, స్పేస్ బ్లాక్.., వివో వీ29 ప్రో (Vivo V29 Pro) ఫోన్ రెండు కలర్ ఆప్షన్లు – హిమాలయన్ బ్లూ, స్పేస్ బ్లాక్ ఆప్షన్లలో లభిస్తుంది. రెండు ఫోన్లూ 6.78 -అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే విత్ స్లీక్, స్టైలిష్ డిజైన్ కలిగి ఉంటాయి.
వివో వీ 29 (Vivo V29) ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్లు – 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.32,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.36,999లకు లభిస్తాయి.
వివో వీ29 ప్రో (Vivo V29 Pro) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.39,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.42,999లకు లభిస్తాయి. రెండు ఫోన్లపై ప్రీ-ఆర్డర్లు గురువారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ నెల పదో తేదీ నుంచి వివో వీ29 ప్రో, ఈ నెల 17వ తేదీ నుంచి వివో వీ29 ఫోన్ సేల్స్ ప్రారంభం అవుతాయి. వివో అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్, క్ర్మా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ తదితర రిటైల్ స్టోర్లలో లభిస్తాయి.
వివో వీ29, వివో వీ29 ప్రో ఫోన్లు ప్రీమియం లుక్‌తో కర్వ్డ్ స్క్రీన్ కలిగి ఉంటాయి. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్, స్మార్ట్ ఔరా లైట్ ఆప్షన్లతో వస్తున్నాయి.
వివో వీ29 ప్రో హిమాలయన్ బ్లూ కలర్ ఫోన్ 3డీ పార్టికల్ డిజైన్, బ్యాక్ ప్యానెల్‌పై మౌంటేన్ టెక్స్చర్ ఫ్లోటింగ్, వివో వీ29 ఫోన్ బ్యాక్ ప్యానల్ పై కలర్ చేంజింగ్ ఆప్షన్ ఫీచర్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లు 6.78 అంగుళాల డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లు టైప్-సీ చార్జింగ్ పోరట్ కలిగి ఉంటాయి.
వివో వీ29 ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778 జీ చిప్ సెట్, వివో వీ29 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ కలిగి ఉంటాయి. వివో వీ29 ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఓఐఎస్, 8-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్, 2-మెగా పిక్సెల్ బొకెహ్ లెన్స్, వివో వీ29 ప్రో ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఓఐఎస్, 12 -మెగా పిక్సెల్ పోర్ట్రైట్ లెన్స్, 8-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా ఉంటాయి.రెండు ఫోన్లలో సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. వివో వీ29, వివో వీ29 ప్రో ఫోన్లు రెండు 80వాట్ల ఫ్లాష్ చార్జ్ మద్దతుతో 4600 ఎంఏహెచ్ (టీవైపీ) కెపాసిటీ గల బ్యాటరీ మద్దతు కలిగి ఉంటాయి. 18 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతాయి.