Vivo T3 5G | 21న వివో టీ3 5జీ ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Vivo T3 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో టీ3 5జీ (Vivo T3 5G) ఫోన్‌ను ఈ నెల 21న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Vivo T3 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో టీ3 5జీ (Vivo T3 5G) ఫోన్‌ను ఈ నెల 21న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ఎస్వోసీ చిప్సెట్తో వస్తుందని తెలుస్తున్నది. ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. వివో టీ3 5జీ ఫోన్ ధర రూ.20 వేల లోపు ఉంటుందని తెలుస్తున్నది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయాలు జరుగుతాయని సమాచారం.
వివో టీ3 5జీ ఫోన్ క్రిస్టల్ ఫ్లేక్, కాస్మిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుందని సమాచారం. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్ డిస్ ప్లే ఉంటుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ / 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ఫోన్ ర్యామ్ వర్చువల్‌గా పెంచుకోవచ్చు.
వివో టీ3 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 లెన్స్ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ బొకెహ్ లెన్స్, ఫ్లికర్ సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

