న్యూఢిల్లీ: దేశంలో ప్రముఖ టెలీఫోన్ నెట్వర్క్ అయిన వొడాఫోన్ ఐడియా (Vi) తన కస్టమర్లకు సరికొత్త ప్రీపేయిడ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.2999, రూ.2899, రూ.3099లతో 365 రోజులు చెల్లుబాటయ్యేలా ప్లాన్స్ రూపొందించింది. ఇందులో 4జీబీ డాటా కనెక్టివిటీతో 850 జీబీ డాటా, ప్రతి రోజు 100 ఎస్సెమ్మెస్‌లు, అన్లిమిటెడ్ కాలింగ్, రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు అన్లిమిటెడ్ బ్రౌసింగ్ అవకాశం కల్పించింది.
రూ.2999 రీచార్జ్‌తో 365 రోజుల వ్యాలిడిటీ, 850 జీబీ డాటా, ప్రతి రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు, రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు అదనంగా అన్‌లిమెటెడ్ ఇంటర్నెట్ బ్రౌస్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఇక రూ.2899 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుందని, అచ్చం రూ.2999 ప్లాన్‌లో ఉన్న సౌకర్యాలన్ని ఇందులో కూడా ఉంటాయని తెలిపింది. అయితే రోజుకు 1.5 జీబీ డాటా మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఇక రూ.3099 ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా.. ఏడాది వ్యాలిడిటీతోపాటు అదనంగా వీఐ హీరో బెనిపిట్స్, ఏడాదిపాటు డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపింది.