న్యూఢిల్లీ, డిసెంబర్ 1: దేశీయ మార్కెట్లో వాహన విక్రయాలు గత నెల జోరుగా సాగాయి. ప్రధాన ఆటో కంపెనీలన్నీ నిరుడుతో పోల్చితే ఈ నవంబర్‌లో రెండంకెల వృద్ధిని సాధించాయి. ముఖ్యంగా ప్యాసింజర్ కార్లకు డిమాండ్ కనిపించింది. మారుతీ చిన్న కార్లు ఆల్టో, ఎస్-ప్రెస్సోకు మార్కెట్లో ఆదరణ పెరిగింది. స్విఫ్ట్, సెలీరియో, బాలెనో మోడళ్లూ కొనుగోలుదారులను ఆకట్టుకున్నాయి. ఇక ద్విచక్ర వాహన విభాగంలో హోండా మోటర్‌సైకిల్స్ భారీ వృద్ధిని అందుకున్నది. అయితే బజాజ్ ఆటో నిరశ పర్చగా.. హీరో అంతంతమాత్రం వృద్ధిని అందుకున్నది.