ట్రూజోన్ చేతికి సోలార్ ప్రాజెక్టులు
హైదరాబాద్ ఆధారిత ట్రూజోన్ క్లీన్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ (సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్).. మహారాష్ట్రలో సోలార్ ప్రాజెక్టుల ఆర్డర్‌ను దక్కించుకున్నది. హింగోలి, లాతూర్, పర్భణి, బీడ్ జిల్లాల్లో 72 మెగావాట్ల సామర్థ్యంతో ఈ సోలార్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నారు.
- హరిఓం పవర్ అండ్ ఎనర్జీ నుంచి 72 మెగావాట్ల ఆర్డర్
హైదరాబాద్, అక్టోబర్ 16 : హైదరాబాద్ ఆధారిత ట్రూజోన్ క్లీన్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ (సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్).. మహారాష్ట్రలో సోలార్ ప్రాజెక్టుల ఆర్డర్‌ను దక్కించుకున్నది. హింగోలి, లాతూర్, పర్భణి, బీడ్ జిల్లాల్లో 72 మెగావాట్ల సామర్థ్యంతో ఈ సోలార్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నారు. రూ.236 కోట్ల విలువైన ఈ ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) ఆర్డర్.. హరిఓం పవర్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ట్రూజోన్ పొందింది. ఈ మేరకు తాజాగా సెబీకి హరిఓం తెలియజేసింది. కాగా, పీఎం-కుసుమ్ కింద ఈ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది.
ఇప్పటికే 15 మెగావాట్ల పనులను ట్రూజోన్ పూర్తిచేసింది. వ్యవసాయ రంగంలో సౌరశక్తి వినియోగాన్ని పెంచడం, సాగుకు సౌర విద్యుదుత్పత్తిని దన్నుగా నిలుపడమే ఈ ప్రాజెక్టుల లక్ష్యం. ఇక ఈ ఆర్డర్‌ను తమ సంస్థకు కీలక మైలురాయిగా ట్రూజోన్ సోలార్ ఎండీ చారుగుండ్ల భవానీ సురేశ్ అభివర్ణించారు. ఈ ప్రాజెక్టుల్ని తమ సంస్థకు ఇచ్చినందుకు హరిఓం ఇండస్ట్రీస్ ఎండీ రుపేశ్ గుప్తాకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఆరేండ్లుగా రెండు సంస్థల మధ్య వ్యాపార సహకారం ఉందని గుప్తా ఈ సందర్భంగా వెల్లడించారు. వేగంగా పనులను జరిపేందుకు తమ బృందాలు కృషి చేస్తున్నట్టు ట్రూజోన్ సీఈవో శ్రీనివాస్ జక్కుల తెలియజేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

