విపణిలోకి ట్రయంఫ్ ట్రైడెంట్ 660

- ప్రారంభ ధర రూ.6.95 లక్షలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: బ్రిటన్‌కు చెందిన ప్రీమియం మోటర్‌సైకిళ్ల తయారీ సంస్థ ట్రయంఫ్.. భారత మార్కెట్లోకి సరికొత్త ట్రైడెంట్ 660 మోడల్ బైక్‌ను ప్రవేశపెట్టింది. నాలుగు రంగుల్లో లభ్యమయ్యే ఈ బైక్ ప్రారంభ ధరను రూ.6.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. మిడిల్ వెయిట్ రోడ్‌స్టర్ సెగ్మెంట్లో తీసుకొచ్చిన ఈ మోడల్ ధరను ప్రకటించకముందే 125 బుకింగ్స్ వచ్చినట్లు ట్రయంఫ్ ఇండియా వెల్లడించింది. లిక్విడ్ కూల్ 12 వాల్వ్ 3 సిలిండర్ 660 సీసీ ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, రెండు చక్రాలకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎల్ఈడీ లైట్లు, సెల్ఫ్ క్యాన్సెలింగ్ ఇండికేటర్లు, టీఎఫ్టీ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఈ బైక్ ప్రత్యేకతలు. ట్రైడెంట్ 660 బైక్‌ను ఎక్కువ మంది కొనుగోలు చేసేందుకు వీలుగా రూ.9,999 ఈఎంఐతో ప్రత్యేక ఫైనాన్స్ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నామని, అంతేకాకుండా ఈ బైక్‌ను కస్టమైజ్ చేసుకునేందుకు 45కు పైగా యాక్సెసరీస్లను అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రకటించింది. కవాసకీ జడ్ 650, హోండా సీబీ 650ఆర్ లాంటి బైక్‌లకు ట్రైడెంట్ 660 గట్టి పోటీ ఇవ్వగలదని ట్రయంఫ్ భావిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

