Triumph Scrambler 1200X | మార్కెట్లోకి ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200ఎక్స్.. రూ.11.83 లక్షల నుంచి ప్రారంభం.. ఇవీ డిటైల్స్
Triumph Scrambler 1200X | ప్రముఖ టూ వీలర్స్ ట్రయంఫ్.. భారత్ మార్కెట్లో తన న్యూ స్క్రాంబ్లర్ 1200ఎక్స్ బైక్ ఆవిష్కరించింది. దీని ధర రూ.11.83 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
Triumph Scrambler 1200X | ప్రముఖ టూ వీలర్స్ ట్రయంఫ్.. భారత్ మార్కెట్లో తన న్యూ స్క్రాంబ్లర్ 1200ఎక్స్ బైక్ ఆవిష్కరించింది. దీని ధర రూ.11.83 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఈ మోటారు సైకిల్ కార్నివాల్ రెడ్, యాష్ గ్రే, సఫైర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. పూర్తిగా భారత్ లోనే నిర్మించి విక్రయిస్తారు. స్క్రాంబ్లర్ 1200ఎక్స్ఈ బైక్ ధర కంటే. రూ.1.10 లక్షలు తక్కువ.
కొత్త ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200 మోటారు సైకిల్ 820 ఎంఎం ఎత్తు నుంచి రైడర్ల సౌకర్యం కోసం 795 ఎంఎంకు తగ్గించారు. నాన్ అడ్జస్టబుల్ అప్ సైడ్ – డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ ఫర్ కంఫర్ట్ రైడింగ్, రేర్‌లో మార్జోచి మోనోషాక్ కోసం ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. ఫ్రంట్‌లో ఏబీఎస్‌తోపాటు 2 పిస్టన్ నిస్సిన్ కాలిపర్స్‌తో కూడిన 310 ఎంఎం ట్విన్ డిస్క్ ప్లేట్, రేర్‌లో ఏబీఎస్‌తోపాటు సింగిల్ పిస్టన్ కాలిపర్‌తో 255 ఎంఎం సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఎక్స్ఈ ట్రిమ్ కంటే పొట్టిగా న్యూ స్క్రాంబ్లర్ 1200 ఎక్స్ హ్యాండిల్ బార్ 65ఎంఎం పొడవు ఉంటుంది.
న్యూ స్క్రాంబ్లర్ 1200 బైక్ 1200 సీసీ పార్లల్ ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ విత్ 270 డిగ్రీ క్రాంక్ కలిగి ఉంటుంది. ఇది 7000 ఆర్పీఎం వద్ద 89 బీహెచ్పీ విద్యుత్, 4250 ఆర్పీఎం వద్ద 110 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ గేర్ బాక్స్ తో ఇంజిన్ అమర్చారు. రౌండ్ షేప్డ్ టీఎఫ్టీ డిస్ ప్లే, టర్న్ బై టర్న్ నేవిగేషన్, నోటిఫికేషన్ అలర్ట్స్ కోసం బ్లూ టూత్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. 5-రైడింగ్ మోడ్స్ – రెయిన్, రోడ్, స్పోర్ట్, ఆఫ్ రోడ్, బీస్పోక్ రైడర్ మోడ్స్ లో లభిస్తుంది. ఐఎంయూ అనేబుల్డ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, కార్నరింగ్ డ్యుయల్ చానెల్ ఏబీఎస్ కూడా ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

