Triumph Daytona 660 | 9న భారత్ మార్కెట్లోకి ట్రయంఫ్ డేటోనా660 బైక్.. ఇవీ డిటైల్స్..!
Triumph Daytona 660 | భారత్ తోపాటు గ్లోబల్ మార్కెట్లో వచ్చేనెల తొమ్మిదో తేదీన మిడిల్ వైట్ స్పోర్ట్ బైక్ ‘డేటోనా660’ ఆవిష్కరించనున్నది. భారత్ లో ఈ బైక్ ధర రూ.9.50 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు.
Triumph Daytona 660 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ట్రయంఫ్ తన మిడిల్ వైట్ స్పోర్ట్ బైక్ ‘డేటోనా 660’ స్పోర్ట్ టూరర్ మోటారు సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లో వచ్చేనెల తొమ్మిదో తేదీన ఆవిష్కరించనున్నది. భారత్ మార్కెట్లో ఈ మోటారు సైకిల్ ధర రూ.9.50 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. యమహా ఆర్7, కవాసాకి నింజా 650, హోండా సీబీఆర్ 650ఆర్ మోటారు సైకిళ్లతో ట్రయంఫ్ డేటోనా 660 బైక్ పోటీ పడుతుంది.
టైగర్ స్పోర్ట్ 660, ట్రైడెంట్ 660 మోటారు సైకిళ్లలో వాడిన ఇంజిన్ వాడుతారని భావిస్తున్నారు. 660సీసీ ట్రయంఫ్ ఇంజిన్ త్రీ-సిలిండర్, లిక్విడ్ -కూల్డ్ యూనిట్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 81 హెచ్‌పీ విద్యుత్, 64 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. స్లిప్, అసిస్ట్ క్లచ్‌తోపాటు 6-స్పీడ్ గేర్ బాక్స్, 2-వే క్విక్ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కలిగి ఉంటుంది. 2-రైడింగ్ మోడ్స్- రెయిన్, రోడ్ మోడ్స్‌లో లభిస్తుంది.
డ్యుయల్ ఎల్ఈడీ హెడ్‌లైట్ క్లస్టర్, క్లిప్ హ్యాండిల్ బార్, ట్రైడెంట్, టైగర్ స్పోర్ట్ మోటారు సైకిళ్లలో మాదిరిగా స్విచ్ గేర్స్, లీవర్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్లు ఉంటాయి. ఫ్రంట్‌లో నాన్ అడ్జస్టబుల్ అప్‌సైడ్ యూఎస్డీ డౌన్ఫోర్క్, రేర్‌లో మోనో షాక్ యూనిట్, రెండు వీల్స్‌పై డిస్క్ బ్రేక్స్ ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

