Toyota Cut in Production | జూన్ నుంచి టయోటా కార్ల ఉత్పత్తిలో కోత ఇలా
Toyota Cut in Production | టయోటా మోటార్స్ వచ్చే నెల నుంచి ఆగస్టు వరకు ప్రతి నెలా లక్ష కార్ల ఉత్పత్తి తగ్గిస్తామని ప్రకటించింది.
Toyota Cut in Production | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్ కార్పొరేషన్ వచ్చే నెలలో ప్రపంచవ్యాప్తంగా కార్ల తయారీ లక్ష్యంలో కోత విధిస్తామని తెలిపింది. మొత్తం లక్ష కార్ల ఉత్పత్తి తగ్గిస్తామని ప్రకటించింది. దీంతో జూన్లో సుమారు 8.5 లక్షల వాహనాలు ఉత్పత్తి చేస్తామని మంగళవారం వెల్లడించింది. దీనికి సెమీ కండక్టర్ల కొరతే కారణమని పేర్కొంది.
కానీ, వచ్చే మార్చి నెలాఖరు నాటికి 97 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంలో ఎటువంటి మార్పు చేయడం లేదని టయోటా మోటార్ కార్పొరేషన్ తెలిపింది. షాంఘైలో కొవిడ్-19 లాక్డౌన్ విధించడం వల్ల ఉత్పత్తి కేంద్రంలో అదనపు ఉత్పత్తి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
బుధవారం నుంచి జూన్ మూడో తేదీ వరకు ఐదు రోజులు అదనపు ఉత్పత్తి నిలిపివేసినట్లు ప్రకటించింది. దీని ఫలితంగా మే, జూన్ నెలల్లో 16 లైన్లలో ఉత్పత్తి నిలిచిపోతుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు ప్రతి నెలా 8.5 లక్షల కార్లు ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక రూపొందించింది. చిప్స్ కోరత, కొవిడ్ మహమ్మారి ఇతర కారణాల వల్ల ఉత్పత్తిలో కోత విధించామని వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

