Toyota Cars Recall | ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్ ప్రాబ్లం.. 1390 కార్లు రీకాల్ చేసిన టయోటా!
Toyota Cars Recall | ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌లో సాంకేతిక లోపంతో 1390 కార్లు రీకాల్ చేస్తున్నట్లు టయోటా కిర్లోస్కర్ సోమవారం వెల్లడించింది.
Toyota Cars Recall | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్.. మార్కెట్ నుంచి 1390 కార్లను రీకాల్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మోడల్ కార్లలో ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌లో సాంకేతిక లోపం తలెత్తినందున వాటిని రీ కాల్ చేస్తున్నట్లు తెలిపింది. గతేడాది (2022) డిసెంబర్ ఎనిమిదో తేదీ నుంచి ఈ నెల 12 మధ్య తయారైన కార్లను రీకాల్ చేస్తున్నామని పేర్కొంది. బాధిత కార్ల వినియోగదారులు వెంటనే తమ డీలర్లను సంప్రదించాలని సూచించింది.
ఉచితంగా ఆయా కార్లలో ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్ రీ ప్లేస్ చేస్తున్నట్లు పేర్కొంది. కస్టమర్లు తమ కారు `వీఐఎన్ (VIN) నంబర్` ఉపయోగించి సంబంధిత కారులో ఆ సమస్య ఉందా? అన్న విషయం తెలుసుకోవాలని వెల్లడించింది. ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్ రీ ప్లేస్ చేసేవరకు ఆయా కార్ల వాడకం తగ్గించాలని స్పష్టం చేసింది.
ఇంతకుముందు మారుతి సుజుకి సైతం ఎయిర్‌బ్యాగ్ డిఫెక్ట్ కారణంగా వివిధ మోడళ్లకు చెందిన 17,362 కార్లు రీకాల్ చేసింది. వాటిలో ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజా, బాలెనో, గ్రాండ్ విటారా మోడల్ కార్లు ఉన్నాయి. గత నెల 8 నుంచి ఈ నెల 12 వరకు తయారైన కార్లలో ఈ ఎయిర్‌బ్యాగ్ డిఫెక్ట్ తలెత్తితే ఉచితంగా రీప్లేస్ చేస్తామని మారుతి తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

