Toyota Cars | ప్రముఖ వాహనాల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తమ కార్ల ధరలను పెంచేసింది. అన్ని మోడళ్ల కార్లపై దాదాపు ఒక శాతం మేర ధరలు పెంచుతున్నట్లు టయోటా కంపెనీ ప్రకటించింది. వాహనాల తయారీలో కీలకమైన ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో వాహనాల ధరల పెంపు నిర్ణయం తీసుకోకతప్పలేదని తెలిపింది.
కారు మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెరుగుదలలో మార్పు ఉంటుందని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. పెరిగిన ఈ ధరలు జూలై 5వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయని పేర్కొంది.