SUV Cars | ఎస్యూవీ కార్లకే అగ్ర తాంబూలం.. టాప్‌గేర్‌లో మారుతి వ్యాగన్-ఆర్..!
SUV Cars | ఏప్రిల్ కార్ల సేల్స్‌లో ఎస్యూవీ కార్లే అత్యధికంగా అమ్ముడయ్యాయి. వాటిల్లో మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ మొదటి స్థానంలో నిలిచింది. మారుతి, హ్యుండాయ్, టాటా కార్ల సేల్స్ నువ్వానేనా అన్నట్లు సాగుతున్నాయి.
SUV Cars | గత నెలలో కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి ముందు వరుసలో నిలిచింది. టాప్-10 కార్లలో ఆరు మారుతి సుజుకి మోడల్ కార్లే ఉన్నాయి. తర్వాతీ జాబితాలో హ్యుండాయ్ మోటార్స్, టాటా మోటార్స్ కార్లు రెండు మోడల్స్ చోటు దక్కించుకున్నాయి. విడి భాగాల సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నా.. కార్ల సేల్స్ లో గ్రోత్ నమోదవుతున్నది. గత నెలలో 3,31,747 కార్లు అమ్ముడయ్యాయి. ప్రతి పది కార్లలో ఐదు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) కార్లు, నాలుగు హ్యాచ్ బ్యాక్, ఒక వ్యాన్ ఉన్నాయి.
ఏప్రిల్ నెల కార్ల విక్రయాల్లో ఎస్యూవీ కార్లదే అగ్ర తాంబూలం. మొత్తం కార్ల సేల్స్‌లో ఎస్‌యూవీలు 47.4 శాతం ఉన్నాయి. వాటిల్లో మారుతి సుజుకి కార్లలో వ్యాగన్-ఆర్, స్విఫ్ట్, బాలెనో, టాటా నెక్సాన్, హ్యుండాయ్ క్రెటా, మారుతి సుజుకి ఆల్టో, టాటా పంచ్, మారుతి సుజుకి ఎకో, హ్యుండాయ్ వెన్యూ నిలిచాయి.
ఏప్రిల్ నెలలో మారుతి వ్యాగన్-ఆర్ అత్యధికంగా 20,879 కార్లు విక్రయించగా, స్విఫ్ట్ 18573, బాలెనో 16,180 యూనిట్లు అమ్ముడయ్యాయి. తర్వాత స్థానంలో ఉన్న టాటా నెక్సాన్ 15,002, హ్యుండాయ్ క్రెటా 14,186, మారుతి బ్రెజా 11,836 యూనిట్లు విక్రయించారు.
టాప్-10 కార్లలో మారుతి, టాటా, హ్యుండాయ్ పోటాపోటీగా అమ్ముడయ్యాయి. మారుతి ఆల్టో 11,548 యూనిట్లు సేల్ కాగా, టాటా పంచ్ 10,934, మారుతి ఎకో 10,504, హ్యుండాయ్ వెన్యూ 10,342 కార్లు అమ్ముడయ్యాయి.
ఏప్రిల్ నెలలో అమ్ముడైన టాప్-10 కార్ల డిటైల్స్ ఇవే
మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ – 20,879 యూనిట్లు
మారుతి సుజుకి స్విఫ్ట్ – 18,573 యూనిట్లు
మారుతి సుజుకి బాలెనో – 16,180 యూనిట్లు
టాటా నెక్సాన్ – 15,002 యూనిట్లు
హ్యుండాయ్ క్రెటా – 14,186 యూనిట్లు
మారుతి సుజుకి బ్రెజా – 11,836 యూనిట్లు
మారుతి సుజుకి ఆల్టో – 11,548 యూనిట్లు
టాటా పంచ్ – 10,934 యూనిట్లు
మారుతి సుజుకి ఎకో – 10,504 యూనిట్లు
హ్యుండాయ్ వెన్యూ – 10,342 యూనిట్లు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

