హైదరాబాద్, మే 20: టాటా గ్రూపునకు చెందిన టైటాన్ కంపెనీ లిమిటెడ్..హైదరాబాద్లో 14 రిటైల్ అవుట్లెట్లను ఆరంభించింది. రాష్ట్రంలో కంపెనీ కస్టమర్లు క్రమంగా పెరుగుతుండటంతో గత రెండు రోజుల్లో ఆభరణాలు, గడియారాలు, ఐకేర్, ఎథిక్ వియర్ విభాగాలకు చెందిన షోరూంలను కంపెనీ ఎండీ సీకే వెంకటరామన్ ప్రారంభించారు.
ఈ షోరూంలు ప్రారంభం సందర్భంగా ఈ అవుట్లెట్లలో రాయితీలు ఇస్తున్నట్లు తెలిపింది. దీంతో హైదరాబాద్లో స్టోర్ల సంఖ్య 109కి చేరుకోగా..ఈ ఏడాది కొత్తగా మరో 31 స్టోర్లను ఆరంభించాలనుకుంటున్నట్లు వెంకటరామన్ తెలిపారు.