Spam Calls and Messages | స్పామ్ కాల్స్, మెసేజ్‌లతో విసుగెత్తిపోతున్నారా?.. నెట్వర్క్ ఏదైనా వాటిని ఈజీగా బ్లాక్ చేయండిలా..
స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేయడం కోసం ట్రాయ్ ఎన్సీపీఆర్ అనే వ్యవస్థను తీసుకొచ్చింది
Spam Calls and Messages : స్పామ్ లేదా మార్కెటింగ్ కాల్స్, మెసేజ్‌లు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. తెలియని నంబర్ల నుంచి పదే పదే కాల్స్ వస్తుంటే ఎవరికైనా చిరాకు వస్తుంది. దాంతో కొన్నిసార్లు ముఖ్యమైన కాల్స్‌ను కూడా స్పామ్ కాల్‌గా పొరబడే అవకాశం ఉంది. అందుకని వాటిని బ్లాక్ చేయడం ఎలా? అని ఆలోచిస్తుంటారు. అలాగని అన్ని నంబర్లను బ్లాక్ చేయడం కుదరదు. అయితే.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) యూజర్లకు స్పామ్ లేదా మార్కెటింగ్ కాల్స్‌ను బ్లాక్ చేసే అశకాశం కల్పిస్తోంది. నెట్వర్క్ ఏదైనా స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టొచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
స్పామ్ కాల్స్, మెసేజ్‌లను బ్లాక్ చేయడం కోసం ట్రాయ్ ప్రత్యేకంగా నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (ఎన్సీపీఆర్) అనే వ్యవస్థను తీసుకొచ్చింది. దాంతో, జియో, ఎయిర్టెల్, వీఐతో పాటు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ యూజర్లు కూడా తమ ఫోన్లో డు నాట్ డిస్టర్బ్ (డీఎన్డీ) సర్వీస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఎలా యాక్టివేట్ చేయాలంటే..
మెసేజ్ ఫోల్డర్లోకి వెళ్లి.. START అని ఇంగ్లీష్‌లో టైప్ చేయాలి. ఆ పదాన్ని 1909 నంబర్‌కు పంపించాలి. యూజర్లు వాడుతున్న నెట్వర్క్ నుంచి వెంటనే మెసేజ్ వస్తుంది. అందులో బ్యాంక్, హోటళ్లు..ఇలా కేటగిరీల వారీగా వివరాలు, వాటికి ఒక కోడ్ ఉంటుంది. వాటిలో స్పామ్ కాల్స్ బ్లాక్ చేయాలి అనుకున్న కేటగిరీ కోడ్ టైప్ చేసి రిప్లయ్ ఇవ్వాలి. వెంటనే మీ రిక్వెస్ట్‌ను స్వీకరించినట్టు నెట్వర్క్ నుంచి మెసేజ్ వస్తుంది. 24 గంటల్లో డు నాట్ డిస్టర్బ్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. దాంతో, థర్డ్‌పార్టీ కమర్షియల్ కాల్స్ మాత్రమే బ్లాక్ అవుతాయి. బ్యాంకులు, ఆన్లైన్ పోర్టల్స్, సర్వీస్‌కు సంబంధించిన మెసేజ్‌లు బ్లాక్ కావు. నెట్వర్క్ వారీగా డూ నాట్ డిస్టర్బ్ మోడ్‌ని యాక్టివేషన్ ఎలాగో చూద్దాం.
జియో యూజర్లు
మై జియో యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. సర్వీస్ సెట్టింగ్స్‌లో డు నాట్ డిస్టర్బ్ ఆప్షన్ ఉంటుంది. అందులో స్పామ్ కాల్స్, మెసేజ్‌లను బ్లాక్ చేయాలనుకున్న కేటగిరీ ఎంచుకోవాలి.
ఎయిర్టెల్ నెట్వర్క్ యూజర్లు
ఎయిర్టెల్ అఫీషియల్ సైట్లో (airtel.in/airtel-dnd)కి వెళ్లాలి. ఫోన్ నంబర్ ఎంటర్ చేయగానే వెరిఫికేషన్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి, బ్లాక్ చేయాలనుకున్న కేటగిరీని సెలక్ట్ చేసుకోవాలి.
వీఐ యూజర్లు
discover.vodafone.in/dndలోకి వెళ్లాలి. ఫోన్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, పేరు ఎంటర్ చేయాలి. బ్లాక్ చేయాలనుకున్న కేటగిరీని ఎంపిక చేసుకోవాలి.
బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ యూజర్లు
1909 నంబర్‌కు start dnd అని మెసేజ్ చేయాలి. వెంటనే కేటగిరీల వివరాలు వస్తాయి. అందులో బ్లాక్ చేయాలనుకున్న కేటగిరీని సెలక్ట్ చేసుకోవాలి. వాయిస్‌కాల్, మెసేజ్‌లను కూడా బ్లాక్ చేయొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- aitel
- bsnal
- do not disturb mode
- jio
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

