TikTok layoffs | లేఆఫ్స్ ప్రకటించిన టిక్‌టాక్ : సేల్స్, అడ్వర్టైజింగ్ విభాగంలో కొలువుల కోత
TikTok layoffs : ఈ ఏడాది కొలువుల కోత ప్రకటించిన గూగుల్, అమెజాన్, యూనిటీ, డిస్కార్డ్ వంటి టెక్ కంపెనీల సరసన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్ చేరింది.
TikTok layoffs : ఈ ఏడాది కొలువుల కోత ప్రకటించిన గూగుల్, అమెజాన్, యూనిటీ, డిస్కార్డ్ వంటి టెక్ కంపెనీల సరసన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్ చేరింది. లాస్ఏంజెల్స్, న్యూయార్క్, అస్టిన్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు లొకేషన్స్‌లో పనిచేస్తున్న దాదాపు వంద మంది ఉద్యోగులపై టిక్‌టాక్ వేటు వేసింది. ఆర్ధిక మందగమనం నేపధ్యంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా టిక్‌టాక్ లేఆఫ్స్‌కు మొగ్గుచూపిందని ఎన్పీఆర్ రిపోర్ట్ పేర్కొంది.
వివిధ విభాగాలపై లేఆఫ్స్ ప్రభావానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు. పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికల కారణంగా సేల్స్, అడ్వర్టైజింగ్ విభాగానికి చెందిన దాదాపు 60 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్టు కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారు.
7000 మంది ఉద్యోగులతో అమెరికాలో టాప్ యాప్స్‌లో టిక్‌టాక్ ఒకటిగా నిలవగా ప్రమోటింగ్ కంపెనీ చైనీస్ టెక్ దిగ్గజం బైట్‌డ్యాన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 1,50,000 మందికిపైగా పనిచేస్తున్నారు. ఆర్ధిక మందగమనం, టెక్ పరిశ్రమలో సంక్షోభం కారణంగా టిక్‌టాక్ సైతం క్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొంటోంది. దీంతో వ్యయ నియంత్రణ చర్యలతో కార్యకలాపాల పునర్వ్యవస్ధీకరణ చేపట్టింది. ఈ క్రమంలో పలు విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను టిక్‌టాక్ కుదిస్తోంది.
Read More :
Hemant Soren| హేమంత్ సోరెన్‌కు మరోసారి ఈడీ నోటీసులు..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

