ESAF Small Finance Bank | ఈ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లపై 8.50 శాతం వడ్డీ..!
Esaf Small Finance Bank | ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కొత్తగా 999 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ తెచ్చింది. దీనిపై ఖాతాదారులకు గరిష్టంగా 8.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది.
ESAF Small Finance Bank | స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) కింద ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ( ESAF Small Finance Bank ) సాధారణ ఖాతాదారులకు 8శాతం, సీనియర్ సిటిజన్లకు 8.50 శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నది. 999 రోజుల గడువు గల ఈ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) ఆఫర్ ఈ నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు సవరించింది. ఏడు రోజుల నుంచి పదేండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 4నుంచి 5.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.50 నుంచి 5.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. ‘999 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌పై సాధారణ ఖాతాదారులకు 8 శాతం వడ్డీరేటు లభిస్తుంది’ అని ఇసాఫ్ ఎస్ఎఫ్బీ ( ESAF SFB ) వెబ్సైట్ తెలిపింది.
ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ఇలా
ఏడు రోజుల నుంచి 14 రోజుల్లోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై నాలుగు శాతం, 15 నుంచి 59 రోజుల్లోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ ఇస్తున్నది. 60 నుంచి 90 రోజుల్లోపు టెన్యూర్ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5 శాతం వడ్డీ పొందొచ్చు. 91 నుంచి 182 రోజుల్లోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ అందుకోవచ్చు. 183 రోజుల నుంచి ఏడాది లోపు ఎఫ్డీపై 5.50 శాతం, ఏడాది ఒక రోజు నుంచి రెండేండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.60 శాతం వడ్డీ లభిస్తుంది.
రెండేండ్ల నుంచి 998 లోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.25 శాతం, 999 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై 8 శాతం వడ్డీ పొందొచ్చు. 1000 రోజుల నుంచి మూడేండ్ల లోపు ఎఫ్డీలపై 7.25 శాతం, మూడేండ్ల నుంచి ఐదేండ్ల లోపు ఎఫ్డీలపై 5.75 శాతం వడ్డీ ఆదాయం లభిస్తుంది. ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐదేండ్ల నుంచి పదేండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది.
More Read:
Fixed Diposits | ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు ఇలా.. అధిక రిటర్న్స్‌లో ఏ బ్యాంక్ బెస్ట్.. !
Fixed Diposits | ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీ.. ఈ నాలుగు బ్యాంకుల్లో ఏది బెస్ట్!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

