Hyundai Grand i10 Nios Corporate | హ్యుండాయ్ హ్యాచ్ బ్యాక్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ వేరియంట్.. రూ.6.93 లక్షల నుంచి షురూ..!
Hyundai Grand i10 Nios Corporate | దక్షిణ కొరియా ఆటోమేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ‘గ్రాండ్ ఐ10 నియోస్ (Grand i10 Nios)’ కార్పొరేట్ వేరియంట్ ఆవిష్కరించింది.
Hyundai Grand i10 Nios Corporate | దక్షిణ కొరియా ఆటోమేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ‘గ్రాండ్ ఐ10 నియోస్ (Grand i10 Nios)’ కార్పొరేట్ వేరియంట్ ఆవిష్కరించింది. దేశంలో అత్యంత తక్కువ ధరకు లభిస్తోంది. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ వేరియంట్ రూ.6.93 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు 1.2 లీటర్ల కప్పా పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఇది గరిష్టంగా 83 పీఎస్ విద్యుత్, 114 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభించింది. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ రూ.6.93 లక్షలు (ఎక్స్ షోరూమ్), కార్పొరేట్ వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ రూ.7.58 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
ఎక్స్టీరియర్ ఫీచర్లు ఇవే..
15-అంగుళాల డ్యుయల్ టోన్ స్టైల్డ్ స్టీల్ వీల్స్, పెయింటెడ్ బ్లాక్ రేడియేటర్ గ్రిల్లె, బాడీ కలర్డ్ ఔట్ సైడ్ డోర్ హ్యాండిల్స్, ఓఆర్వీఎంస్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 7 మోనోటోన్ కలర్స్, టెయిల్ గేట్పై ఎక్స్క్లూజివ్ కార్పొరేట్ ఎంబ్లం అమర్చుతారు.
ఇంటీరియర్ ఫీచర్లు ఇలా
డ్యుయల్ టోన్ గ్రే ఇంటీరియర్, 8.89 సీఎం స్పీడో మీటర్ విత్ ఎంఐడీ, డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్, ఫుట్వెల్ లైటింగ్, ఫ్రంట్ రూమ్ ల్యాంప్, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ బ్యాక్ పాకెట్ ఫీచర్లు ఉన్నాయి. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ వేరియంట్ కారులో 17.14-అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే, యూఎస్బీ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ విత్ ఫోర్ స్పీకర్స్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్ (ఆడియో అండ్ బ్లూటూత్) ఫీచర్లు జత చేశారు.
ఇంకా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎంస్, ఆటో డౌన్ పవర్ విండో ఫర్ డ్రైవర్, రేర్ ఏసీ వెంట్స్, టైప్ సీ ఫాస్ట్ యూఎస్బీ చార్జర్, ప్యాసింజర్ వానిటీ మిర్రర్, రేర్ పవర్ ఔట్ లెట్ వంటి ఫీచర్లు డ్రైవర్, ప్యాసింజర్ల సౌకర్యార్థం జత చేశారు. టీపీఎంఎస్-హైలైన్, 6-ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్ రిమైండర్, 3-పాయింట్ సీట్ బెల్ట్స్ ఫర్ ఆల్ సీట్స్, డే అండ్ నైట్ ఐఆర్వీఎం, ఏబీఎస్ విత్ ఈబీడీ, సెంట్రల్ డోర్ లాకింగ్, ఇన్పాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్ లాక్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

