BPCL SBI Octane Credit Card | ఈ ఫ్యుయల్ క్రెడిట్ కార్డుతో బెస్ట్ క్యాష్ బ్యాక్.. రివార్డు పాయింట్లు.. ఇవీ డిటైల్స్
BPCL SBI Octane Credit Card | ఫ్యుయల్ స్పెండింగ్ మీద రివార్డు పాయింట్లు పొందాలంటే బీపీసీఎల్ ఎస్బీఐ ఒక్టేన్ క్రెడిట్ కార్డు బెస్ట్.
BPCL SBI Octane Credit Card | కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక మోటార్ బైక్ లేదా స్కూటర్.. ఉన్నతాదాయ వర్గాల వారు కార్లు వాడుతున్నారు. పెట్రోల్ ధరలు భగభగమంటున్నాయి. ఈ తరుణంలో నెలవారీ ఆదాయంలో వెహికల్ పెట్రోల్ బిల్లు భారీగా ఉంటుంది.
కార్లు నడిపే వారి పెట్రోల్ బిల్లు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. ఇటువంటి వారి కోసం పలు బ్యాంకులు.. కేంద్ర చమురు సంస్థలతో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. అటువంటి వాటిల్లో బీపీసీఎల్ ఎస్బీఐ ఒక్టేన్ క్రెడిట్ కార్డు.. ఫ్యుయల్ స్పెండింగ్ మీద రివార్డు పాయింట్లు.. గ్రాసరీ కొనుగోళ్లపై రివార్డు పాయింట్లు పొందొచ్చు. ఈ బీపీసీఎల్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు గురించి తెలుసుకుందామా.. !
బీసీసీఎల్.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ కొనుగోళ్లపై 7.25 శాతం రివార్డు రేట్ లభిస్తుంది. బీపీసీఎల్ పెట్రోల్ పంపుల వద్ద పెట్రోల్ కొనుగోలుతోపాటు భారత్ గ్యాస్ యాప్ నుంచి ఎల్పీజీ (వంట గ్యాస్) సిలిండర్ బుక్ చేసుకున్నా ఈ రివార్డు పాయింట్లు లభిస్తాయి.
పెట్రోల్ పై రివార్డు పాయింట్లు ఇలా
పెట్రోల్ మీద రూ.100కి 25 రివార్డు పాయింట్లు (6.25శాతం) లభిస్తాయి.
ఒకశాతం ఫ్యుయల్ సర్ చార్జీ మాఫీ (ఒకసారి రూ.500-4000 మధ్య పెట్రోల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది). నెలకు ఫ్యుయల్ సర్ చార్జి గరిష్టంగా రూ.100 మాఫీ అవుతుంది.
ఒకసారి రూ.10 వేల విలువైన పెట్రోల్ కొనుగోలుపై గరిష్టంగా 2500 రివార్డు పాయింట్లు లభిస్తాయి.
ఇతర రివార్డు పాయింట్లు
డైనింగ్, డిపార్ట్ మెంటల్ స్టోర్స్, గ్రాసరీస్, మూవీ టికెట్ల కొనుగోళ్లపై 2.50 శాతం రివార్డు రేట్ లభిస్తుంది. వీటిపై రూ.100 చొప్పున స్పెండింగ్ మీద 10 రివార్డు పాయింట్లు లభిస్తాయి. నెలలో గరిష్టంగా రూ.30 వేల ఖర్చుపై 7500 రివార్డు పాయింట్లు పొందొచ్చు.
ఎలక్ట్రిసిటి బిల్లు, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్ మీద రూ.100కు ఒక రివార్డు పాయింట్లు లభిస్తాయి.
ఏడాదిలో రూ.3 లక్షలు ఖర్చు చేస్తే రూ.2000 విలువైన గిఫ్ట్ ఓచర్ లభిస్తుంది. ఆదిత్యా బిర్లా, యాత్ర, అర్బన్ లాడర్, హుష్ పప్పీస్, బాటా నుంచి ఈ గిఫ్ట్ ఓచర్లు లభిస్తాయి.
ఏడాదిలో దేశీయ విమానాశ్రయ లాంజ్ ల్లోకి నాలుగు కాంప్లిమెంటరీ లాంజ్ విజిట్స్.
ఫ్రాడ్ మీద రూ.లక్ష వరకు ఇన్సూరెన్స్ కవరేజీ.
18 ఏండ్ల పై చిలుకు వయస్సు గల కుటుంబ సభ్యులకు ఫ్రీ యాడ్ ఆన్ కార్డు.
చార్జీలు.. ఫీజులు ఇలా
బీపీసీఎల్ ఎస్బీఐ ఓక్టేన్ క్రెడిట్ కార్డుపై వార్షిక ఫీజు రూ.1499. 18 శాతం జీఎస్టీ అదనం. అంటే రూ.1768 వార్షిక ఫీజు పే చేయాలి. ఏటా రూ.2 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక ఫీజు రాయితీ లభిస్తుంది. రివార్డు రీడిమ్షన్ ఫీజు రూ.99 ప్లస్ 18 శాతం జీఎస్టీ మొత్తం రూ.116 పే చేయాల్సి ఉంటది. రెంటల్ పేమెంట్స్ మీద ప్రాసెసింగ్ ఫీజు రూ.99 ప్లస్ 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

