Fincare Small Finance Bank | ఈ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ ఆఫర్.. 11 నుంచి అమలు!
Fincare Small Finance Bank | ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 8.25% వడ్డీ ఆఫర్ చేస్తున్నది.
Fincare Small Finance Bank | గత మే నెలలో ఆర్బీఐ రెపోరేట్ పెంచినప్పటి నుంచి బ్యాంకులు వడ్డీరేట్లు పలు దఫాలు పెంచేశాయి. దీంతో ఫిక్స్డ్ డిపాజిటర్లకు డిపాజిట్లపై వడ్డీ ఆదాయం పెరుగుతుంది. దాదాపు బ్యాంకులన్నీ నెలవారీగా వడ్డీరేట్లు పెంచేస్తున్నాయి. ఆ జాబితాలో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా వచ్చి చేరింది. తాజాగా రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు సవరించింది. సవరించిన వడ్డీరేట్లు బుధవారం (2022 అక్టోబర్ 11) నుంచి అమల్లోకి రానున్నాయి.
ఏడు రోజుల నుంచి 45 రోజుల్లోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై మూడు శాతం, 46-90 రోజుల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.5 శాతం వడ్డీ చెల్లించనున్నది. 91-180 రోజుల మధ్య 4.5 శాతం, 181-364 రోజుల టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.5 శాతం, 12 -24 నెలల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.75 శాతం, 500 రోజుల టెన్యూర్ ఎఫ్డీలపై 7.25, 1000 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా రూ.7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది.
24 నెలల ఒక రోజు నుంచి నాలుగేండ్ల గడువు గల టర్మ్ డిపాజిట్లపై ఏడు శాతం, నాలుగేండ్ల ఒక రోజు నుంచి 59 నెలల గడువు గల టర్మ్ డిపాజిట్లపై 6.75 శాతం, 66 నెలల ఒక రోజు నుంచి 84 నెలల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆరు శాతం వడ్డీ అందించనున్నది.
సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ
సీనియర్ సిటిజన్ల అన్ని రకాల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అదనంగా 0.50 శాతం వడ్డీ చెల్లించనున్నది. 7 రోజుల నుంచి 10 ఏండ్ల లోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.50 నుంచి 8.25 శాతం వడ్డీ లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

