New Cars-Bikes | జూలైలో మార్కెట్లో కనువిందు చేసే కార్లు.. మోటారు సైకిళ్లు ఇవే..
New Cars-Bikes | జూలైలో ఆటోమొబైల్ కంపెనీలు కొత్త కార్లు, బైక్స్ విడుదలలో బిజీబిజీగా ఉండనున్నాయి. వచ్చే నెలలో మార్కెట్లోకి కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్, మారుతి ఇన్ విక్టో, హ్యుండాయ్ ఎక్స్ టర్ కార్లతోపాటు హీరోకార్ప్-హార్లీ డేవిడ్సన్, బజాజ్ -ట్రయంఫ్ భాగస్వామ్యంతో తొలి బైక్స్ మార్కెట్లోకి రానున్నాయి.
New Cars-Bikes | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. కాలుష్య నియంత్రణకు రెండో దశ బీఎస్-6 నిబంధనలు అమల్లోకి వచ్చాయి. మరోవైపు ప్రయాణికుల సేఫ్టీతోపాటు హాయిగా ప్రయాణం చేయడానికి వీలుగా కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఆటోమొబైల్ కంపెనీలు కార్లు, మోటారు సైకిళ్లు, స్కూటర్లు తయారు చేస్తున్నాయి. జూలైలో కార్లు, మోటారు సైకిళ్ల లాంచింగ్‌తో ఆటోమొబైల్ సంస్థలు బిజీబిజీగా గడుపనున్నాయి. ఇప్పటికే మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్ కారు కియా సెల్టోస్ అప్ డేట్ కారు సెల్టోస్ ఫేస్ లిఫ్ట్, మారుతి సుజుకి ఎంపీవీ ఇన్ విక్టో, హ్యుండాయ్ మోటార్ ఎక్స్టర్ ఎస్యూవీ కార్లు ఆవిష్కరించనున్నాయి. ఇక హీరో హార్లే, బజాజ్-ట్రైయంప్ భాగస్వామ్యంతో మొదటిసారిగా మోటార్ సైకిళ్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా..
నాలుగో తేదీన కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్

దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా.. భారత్ మార్కెట్లో వచ్చేనెల నాలుగో తేదీన కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ ఆవిష్కరించనున్నది. ఇప్పటికే కస్టమర్లు రూ.25 వేలు చెల్లించి అనధికారిక బుకింగ్స్ నమోదు చేసుకుంటున్నారు. రీ డిజైన్డ్ హెడ్ లైట్స్, డీఆర్ఎల్స్, టెయిల్ లైట్స్.. సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వస్తాయి. ఇవన్నీ ఎల్ఈడీ యూనిట్లుగా ఉంటాయి. గ్రిల్లే, బంపర్స్, అల్లాయ్ వీల్స్ తోపాటు న్యూ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెచ్‌వీఏసీ సిస్టమ్, ఫస్ట్ డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉంటాయి. ఇక ఈ మిడ్ సైజ్ ఎస్యూవీ కారు పనోరమిక్ సన్ రూఫ్, అడాస్ తో కూడిన 16 ఫీచర్లు ఉంటాయని తెలుస్తున్నది.
5న మారుతి ఎంపీవీ ఇన్ విక్టో

మారుతి సుజుకి నుంచి మరో మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) ఇన్ విక్టో వస్తున్నది. టాయోటా ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ టెక్నాలజీతో వస్తున్న ఇన్విక్టో.. మార్కెట్లో ఎంటరయ్యాక మారుతి సుజుకి ఫ్లాగ్ షిప్ మోడల్ కారు కానున్నది. డిఫరెంట్ గ్రిల్లె, ఫ్రంట్ బంపర్, అల్లాయ్ వీల్స్ కొత్తవి రానున్నాయి. రూ.25 వేలు పే చేసి ఇన్ విక్టో కారు బుక్ చేసుకోవచ్చు. అయితే ఇన్ విక్టో ఐఈ స్ట్రాంగ్ హైబ్రీడ్ అల్ఫా + 2ఎల్ సీవీటీ 7ఎస్టీఆర్ నెక్సా బ్లూ (సెలెస్టియల్) కలర్ ఆప్షన్ మాత్రమే బుకింగ్స్‌కి అనుమతి ఇస్తున్నారు.
10న హ్యుండాయ్ ఎక్స్టర్ లాంచింగ్

దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్ కారు ఎక్స్టర్ కారును వచ్చేనెల 10న మార్కెట్లో లాంచ్ చేస్తారు. టాటా మోటార్స్ పంచ్ కారుకు గట్టి పోటీ ఇచ్చే ఎక్స్టర్.. వన్ ఫీచర్-లోడెడ్ వెహికల్, పారా మెట్రిక్ గ్రిల్లె, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, హెచ్-సిగ్నేచర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, హెచ్-సిగ్నేచర్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 8-అంగుళాల హెచ్డీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ 4.2 అంగుళాల కలర్డ్ టీఎఫ్టీ ఎంఐడీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డాశ్ కాం, క్రూయిజ్ కంట్రోల్, సన్ రూఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
3న హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 ఆవిష్కరణ

హీరో మోటో కార్ప్, హార్లీ డేవిడ్సన్ భాగస్వామ్యంతో దేశీయ మార్కెట్లోకి హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 బైక్ వస్తున్నది. వచ్చేనెల మూడో తేదీన మార్కెట్లో లాంచ్ చేస్తారు. రెండు సంస్థలు కలిసి మార్కెట్లో విడుదల చేస్తున్న తొలి బైక్ ఇది. ఈ బైక్ 440సీసీ, సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. డబుల్ డౌన్ ట్యూబ్ టైప్ ఫ్రేమ్ తదితర ఫీచర్లు ఉంటాయి.
5న బజాజ్- ట్రైయంఫ్ స్క్రాంబ్లర్ ఆవిష్కరణ

బజాజ్ ఆటో, ట్రయంఫ్ మోటార్స్ సైకిల్స్ భాగస్వామ్యంతో తయారు చేసిన తొలి మోటారు సైకిల్.. బజాజ్-ట్రయంఫ్ స్క్రాంబ్లర్ వచ్చేనెల ఐదోతేదీన మార్కెట్లో ఆవిష్కరిస్తారు. ఈ బైక్ ధర రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలు పలుకుతుండవచ్చునని అంచనా.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. త్వరలో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం,పెళ్లి తేదీ కూడా ఖరారైందా?
AP News | ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. రాత్రి 8 గంటలకల్లా పూర్తి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు
Russia vs Ukraine | ఉక్రెయిన్‌లోని ఓ గ్రామంపై రష్యా దాడులు.. 26 మంది దుర్మరణం..!
Suriya | ‘రోలెక్స్’ సినిమా ఎప్పుడు వస్తుంది.. ఆయననే అడగాలంటూ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు.. !
Raptadu | రాప్తాడు రంపం దాడి నిందితుడు హేమంత్ కుడికాలు తొలగింపు.. రెండో కాలు తొలగించాల్సిందేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

