Password | ఈ మూడు పాస్‌వర్డ్‌లతో హ్యాకింగ్ ఈజీ..?
Password | మూడు పాస్వర్డ్లు ఉన్న వ్యక్తుల డేటా తేలిగ్గా పొందొచ్చునని నార్డ్‌పాస్ అనే ఓ సాఫ్ట్వేర్ సంస్థ తెలిపింది. ఇప్పటికీ ఎక్కువ మంది వాడుతున్న పాస్వర్డ్ ‘123456’ అని పనామా కేంద్రంగా పని చేస్తున్న నార్డ్‌పాస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ పేర్కొంది.
Password | సైబర్ మోసాలు, హ్యాకింగ్లు పెరిగిపోతుండటంతో బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని టెక్నాలజీ సంస్థలు సూచిస్తున్నా.. యూజర్లలో పెద్ద మార్పేమీ లేదని ఓ అధ్యయనంలో తేలింది. మూడు పాస్వర్డ్లు ఉన్న వ్యక్తుల డేటా తేలిగ్గా పొందొచ్చునని నార్డ్‌పాస్ అనే ఓ సాఫ్ట్వేర్ సంస్థ తెలిపింది. ఇప్పటికీ ఎక్కువ మంది వాడుతున్న పాస్వర్డ్ ‘123456’ అని పనామా కేంద్రంగా పని చేస్తున్న నార్డ్‌పాస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ పేర్కొంది. దీన్ని హ్యాకర్లు, సైబర్ మోసగాళ్లు సెకన్లోపే కనుక్కుంటారని స్పష్టం చేసింది. వెబ్సైట్లతో పోలిస్తే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ వాడే యూజర్లు బలహీన పాస్వర్డ్లు వినియోగిస్తున్నారని తెలిపింది. ఇంతకుముందు ‘password’ ఉండేదని.. కానీ 20 అక్షరాలతో పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఒకే పాస్ వర్డ్ పలు ఖాతాలకు వాడొద్దని హితవు చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 45 లక్షల అకౌంట్లకు ‘123456’ అనే పాస్వర్డ్ ఉందని ఇండిపెండెంట్ సంస్థలతో కలిసి నిర్వహించిన అధ్యయనంలో తేలిందని నార్డ్‌పాస్ పేర్కొంది. దీని తర్వాత ఎక్కువ మంది `అడ్మిన్ admin` అనే పాస్వర్డ్ ఉందని వెల్లడించింది. దీంతో 40 లక్షల ఖాతాలను పొందొచ్చునని వివరించింది. మూడో స్థానంలో ఉన్న ‘12345678’ అనే పాస్‌వర్డ్‌ను సుమారు 13.7 లక్షల ఖాతాదారులు వినియోగిస్తున్నారు.
భారతీయుల్లో సుమారు 3.6 లక్షల మంది ‘123456’ పాస్వర్డ్, 1.2 లక్షల మంది ఖాతాలు ‘admin’ పాస్ వర్డ్ వాడుతున్నారని నార్డ్‌పాస్ వివరించింది. స్టీలర్ మాల్వేర్ల సాయంతో తమ రీసెర్చ్ టీమ్స్ 6.6 టెరాబైట్ల డేటాబేస్ యాక్సెస్ చేసకుని ఈ డేటా సేకరించామని వెల్లడించింది. స్టాటిస్టికల్ డేటా మాత్రమే తాము పొందామని వివరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

