ఏటా కొత్త టెక్నాలజీల రాకతో పాటు భారత్‌లో యువ ప్రొఫెషనల్స్ పెద్దసంఖ్యలో అందుబాటులో ఉండటంతో సరికొత్త ఉపాధి అవకాశాలు ముందుకొస్తున్నాయి. డిజిటలైజేషన్ పెరిగిపోవడంతో పలు రంగాలు, పరిశ్రమల్లో ఉద్యోగాలు అందుబాటులోకి రావడం, సరికొత్త విభాగాల్లో ఉపాధి అవకాశాలు పెరగుతున్నాయి.
నూతన టెక్నాలజీలను వేగంగా అందిపుచ్చుకుని, పరిశ్రమ డిమాండ్లకు అనుగుణంగా తమ నైపుణ్యాలకు పదునుపెట్టుకునే వారికి భారీ వేతన ప్యాకేజ్లతో కొలువులు వరిస్తున్నాయి. ఈ ఏడాది అత్యధిక వేతనం అందుకునే ఉద్యోగాలేవంటే..
ఏఐ ఇంజనీర్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) : కంపెనీ ఏఐ ప్రాజెక్టులను అభభివృద్ధి చేసి, నిర్వహించి పర్యవేక్షించే బాధ్యత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్ట్‌పై ఉంటుంది. ఏఐ ఆర్కిటెక్ట్‌కు స్టాటిస్టిక్స్, గణితంలో మంచి పట్టు ఉండాలి. ఏఐ ఆర్కిటెక్ట్ ప్రోగ్రామింగ్ సామర్ధ్యాలను కలిగిఉండటంతో పాటు పైథాన్, ఆర్ వంటి నైపుణ్యాలను కలిగిఉండాలి. ఏఐ ఆర్కిటెక్ట్‌కు ఏడాదికి రూ 80 లక్షలపైనే వేతన ప్యాకేజ్ ఆఫర్ చేస్తారు.
ఫుల్‌స్టాక్ డెవలపర్ : ఫుల్‌స్టాక్ డెవలపర్లకు ఉద్యోగ అవకాశాలు విరివిగా లభిస్తున్నాయి. ఫ్రంట్ ఎండ్, బ్యాకెండ్ ప్రోగ్రామింగ్‌లో పట్టుతో పాటు కాన్సెప్ట్ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ వరకూ అన్ని దశల అభివృద్ధిపై అవగాహన ఉన్నవారికి ఈ రంగంలో ఆకర్షణీయ వేతనాలకు కొదవలేదు. సగటున ఫుల్‌స్టాక్ డెవలపర్ వార్షిక వేతనం రూ 70 లక్షల పైమాటే
డెవాప్స్ ఇంజనీర్ : స్ర్కిప్టింగ్, కోడింగ్ నైపుణ్యాలు కలిగిన వారికి డెవాప్స్ ఇంజనీర్లుగా ఉపాధి అవకాశాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. నెట్వర్క్ ఆపరేషన్స్‌ను అవగతం చేసుకుని డెవాప్స్ టూల్స్‌ను అభివృద్ధి చేసే వారు ప్రొఫెషనల్స్‌గా ఉన్నతస్ధాయికి చేరుకోవచ్చు. డెవాప్స్ ఇంజనీర్లకు సగటున రూ 80 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేస్తారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ : కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ప్రోగ్రాం డిజైన్ నైపుణ్యాలు కలిగిన ప్రోగ్రామింగ్ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ అధికంగా ఉంది. బ్లాక్‌చైన్ సాఫ్ట్వేర్ ప్రోగ్రాం ఇంజనీర్లకూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. భారత్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వార్షిక సగటు వేతనం రూ 6 లక్షలుగా ఉంది.