Ayushman Bharat | రూ. 10 లక్షల వరకూ ఆయుష్మాన్ భారత్ లిమిట్..?!
Ayushman Bharat | భారతీయులందరికీ వైద్య చికిత్స అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ‘ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా’ పథకం కింద కవరేజీ మొత్తం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Ayushman Bharat | భారతీయులందరికీ వైద్య చికిత్స అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ‘ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా’ పథకం కింద కవరేజీ మొత్తం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 23న 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) – ఆయుష్మాన్ భారత్ స్కీంపై నిర్మలా సీతారామన్ భారీ ప్రకటన చేయనున్నారు. ఇప్పటి వరకు ఆయుష్మాన్ భారత్ కింద చేరిన భారత పౌరులకు రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా వర్తిస్తుంది. ఈ స్కీం కింద ఏటా రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.
అలాగే కేంద్రం తన ఫ్లాగ్ షిప్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం లబ్ధిదారులను వచ్చే మూడేండ్లలో రెట్టింపు చేయాలని కేంద్రం భావిస్తున్నదని అధికార వర్గాల కథనం. ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా కవరేజీ పెంచడం వల్ల మూడింట రెండొంతుల మంది పౌరులకు లబ్ధి చేకూరనున్నదని తెలుస్తున్నది. కరోనా తర్వాత వైద్య చికిత్స పిరంగా మారిన నేపథ్యంలో మధ్య తరగతి వర్గాల ప్రజలకు ప్రస్తుత ఆయుష్మాన్ భారత్ కవరేజీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. పేదలు, నిస్సహాయ కుటుంబాలకు నాణ్యమైన వైద్య చికిత్స లభిస్తుందని చెబుతున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు, భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ చేయూతనిస్తుందని భావిస్తున్నారు.
70 ఏండ్లు దాటిన వృద్ధులందరిని ‘ఆయుష్మాన్ భారత్’ పరిధిలోకి తేవాలని కేంద్రం లక్ష్ంయగా పెట్టుకున్నది. ఒకవేళ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య బీమా కవరేజీ రూ.10 లక్షలకు పెంచితే, ప్రభుత్వ ఖజానాపై రూ.12,076 కోట్ల భారం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. 2018లో ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5 లక్షల బీమా కవరేజీ పథకాన్ని ప్రారంభించారు. దీనివల్ల 12 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు. తాజాగా 70 ఏండ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్య చికిత్స కల్పించడంతోపాటు బీమా కవరేజీ రెట్టింపు చేయడం వల్ల క్యాన్సర్, అవయవాల మార్పిడి వంటి ఖర్చుతో కూడుకున్న వైద్య చికిత్స పేదలకు ఉచితంగా లభిస్తుందని భావిస్తున్నారు. 70 ఏండ్లు దాటిన వారికి అవకాశం ఇవ్వడం వల్ల కొత్తగా సుమారు 4-5 కోట్ల మందికి లబ్ధి చేకూరనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

