ఆఫీస్ స్పేస్.. భలే డిమాండ్
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఆఫీస్ స్పేస్‌కు భలే డిమాండు నెలకొన్నది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఒకేసారి లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఆఫీస్ స్సేస్‌ను లీజుకు తీసుకొంటున్నాయి.
- ఐటీ కారిడార్‌లో 4.87 లక్షల చ.అ స్థలం అద్దెకు తీసుకున్నఅమెజాన్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఆఫీస్ స్పేస్‌కు భలే డిమాండు నెలకొన్నది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఒకేసారి లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఆఫీస్ స్సేస్‌ను లీజుకు తీసుకొంటున్నాయి. ఐటీ కారిడార్‌లోని ఫైనాన్సియల్ డిస్ట్రిక్‌లో ఒకేసారి 4,87,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న గ్రౌండ్ ప్లస్ 10 అంతస్థులను 60 నెలల కాలానికి అమెజాన్ లీజుకు తీసుకొన్నది. దీనికి సంబంధించి గత నెలలో అగ్రిమెంట్ జరిగినట్టు వెల్లడించింది.
దీంతోపాటు మరో రెండు ఐటీ కంపెనీలు భారీ మొత్తంలోనే ఆఫీసు స్పేస్‌ను లీజుకు తీసుకొన్నాయి. నెట్‌క్రాకర్ సంస్థ.. దివ్యశ్రీ టెక్ రిడ్జ్‌లో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఆఫీస్ స్పేస్‌ను , ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్‌లోని ఫీనిక్స్ సెంటారస్‌లో 55,538 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను తీసుకొన్నది. ఇలా ఒకేసారి అతి తక్కువ సమయంలో పలు కంపెనీలు కలిపి మొత్తం 7.43 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని లీజుకు తీసుకోవడం హైదరాబాద్ ఆఫీస్ స్పేస్కున్న డిమాండ్‌కు అద్దంపడుతున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

